బిజినెస్

గత 17 నెలల్లో ఎఫ్‌డిఐ 35 శాతం పెరిగింది: డిఐపిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, డిసెంబర్ 29: గడచిన 17 నెలల్లో భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) 35 శాతం పెరిగాయని పారిశ్రామిక విధాన, ప్రగతి శాఖ (డిఐపిపి) కార్యదర్శి అమితాబ్ కాంత్ తెలిపారు. మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడిన ఆయన ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలు ఎఫ్‌డిఐ రాకలో 16 శాతం క్షీణతను చవిచూసిన వేళ.. భారత్ 35 శాతం వృద్ధిని నమోదు చేసిందన్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టిన దగ్గర్నుంచి ఇప్పటిదాకా వచ్చిన ఎఫ్‌డిఐల్లో 40 శాతం పెరుగుదల కనిపించిందని, అంతకుముందు 17 నెలలతో పోల్చితే, గత 17 నెలల్లో ఇది 35 శాతంగా ఉందన్నారు.