అందమైన దెయ్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దెయ్యం అందంగా వుండడం ఏమిటి? అని అనుకుంటున్నారా... నిజమే దెయ్యాలంటే మనలను భయపెడతాయని తెలుసు.. కానీ ఈ దెయ్యం మాత్రం చూసినవారిని తన ప్రేమలో పడేస్తుంది? మీరు ఒక్కసారి ఆ దెయ్యాన్ని చూశారంటే.. అబ్బా అంత అందంగా వుంది అనుకోవలసిందే! నిజం... ఇంతకీ రెజీనా దెయ్యం కథ ఏమిటో తెలుసుకోవాలని ఆసక్తిగా వుంది కదా.. అక్కడికే వస్తున్నా.. గ్లామర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకున్న రెజీనా మరోవైపు తమిళంలో కూడా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ అక్కడ తన క్రేజ్ నిలుపుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తుంది. ఇప్పటివరకు రొమాంటిక్ హీరోయిన్‌గా నటించిన ఈ అమ్మడు తొలిసారి ఓ హర్రర్ సినిమాలో నటిస్తోంది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందే చిత్రం ‘నింజామ్ మారప్పతిల్లై’. ఈ సినిమాలో రెజీనాతోపాటు ఇటీవలే నిఖిల్ హీరోగా వచ్చిన ‘ఎక్కడికి పోతావు..’ సినిమాలో నటించిన నందిత శే్వత కూడా ఉందట. ఇందులో రెజీనా దెయ్యంగా కనిపిస్తుందని అంటున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తికావచ్చిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అయింది. లేటెస్టుగా రెజీనా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. అందమైన దెయ్యంగా రెజీనా లుక్ అందరిని ఆకర్షిస్తోంది! మరి ఈ సినిమాతో రెజీనా అందరిని భయపెడుతుందో లేదో చూడాలి!