హైదరాబాద్

ఫీజుల బకాయిలు చెల్లించాలని భారీ ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముషీరాబాద్, డిసెంబర్ 3: తెలంగాణ రాష్ట్ర ఫ్రభుత్వానికి విద్యార్ధుల ఫీజుల బకాయిలు చెల్లించటానికి రూ.1600 కోట్లు లేవు కాని, కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి మాత్రం 42 వేల కోట్లు ఎలా వచ్చాయని జాతీయ బిసి సంక్షేమ సంఘం ఆధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. గత సంవత్సర ఫీజుల రియింబర్సమెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద బిసి విద్యార్ధి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బిసి వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాల ద్వారానే సోనియాగాంధీ బయపడి తెలంగాణ ఇచ్చిందని, విద్యార్ధులు కూడా ఫీజుల బకాయిలు, స్కాలర్‌షిప్‌ల సాధనకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. స్కీములను ఎత్తివేయటానికి ప్రభుత్వం చేసే కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్ధుల పోరాట పటిమ ఫలితంగానే తెలంగాణ వచ్చిన విషయాన్ని విస్మరించరాదని అన్నారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజులు ఇవ్వటానికి ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేకతను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇంటర్మీడియెట్ కోర్సుల ఫీజులను మొత్తం ఇవ్వాలని పేర్కొన్నారు. ఇంటర్ విద్యార్ధుల ఫీజుల ఫీజులను సైన్స్. మాథ్స్ విద్యార్థులకు రూ.8వేలు, ఇతర కోర్సులకు రూ.6వేలు ఇవ్వాలనీ, డేస్కాలర్ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ను వెయ్యికి పెంచాలని, కళాశాలు హాస్టల్ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ను రూ.2వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. బిసి విద్యార్థి సంఘం అధ్యక్షుడు ర్యాగ రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్. గుజ్జ కృష్ణ, కుల్కచర్ల శ్రీనివాస్, నీలం వెంకటేష్, విక్రంగౌడ్. సి.రాజేందర్, నర్సింహనాయక్, రామకృష్ణ, నరేష్, రాంబాబు, వినయ్, అనంతయ్య పాల్గొన్నారు.