తెలంగాణ

స్కూళ్లలో ఫీజులు తగ్గించాలని మహాధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు నగరంలోని ఇందిరాపార్కు వద్ద శనివారం ఉదయం మహాధర్నా ప్రారంభించారు. ఇంటర్నేషనల్, టెక్నో, మోడల్ స్కూల్ అంటూ కార్పొరేట్ సంస్థలు అధిక ఫీజులను వసూలు చేస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలో అధికారులు తూతూ మంత్రంలా హెచ్చరికలు చేయడం తప్ప విద్యాసంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేరెంట్స్ అంటున్నారు. పేద, మధ్యతరగతి వర్గాలకు భారంగా మారిన స్కూలు ఫీజులను తగ్గించేవరకూ తమ పోరాటం ఆగదని వారు ప్రకటించారు.