తెలంగాణ

అధిక ఫీజులపై టిఎన్‌ఎస్‌ఎఫ్ నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రైవేటు,కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులను ప్రభుత్వం నియంత్రించనందుకు నిరసనగా తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టిఎన్‌ఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని తెలంగాణ పాఠశాల విద్య కమిషనర్ కార్యాలయం ముట్టడించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్తతను నివారించేందుకు కొంతమంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలను మెరుగుపరచాలని, నిబంధనలను పాటించని ప్రైవేటు పాఠశాలల్ని మూసివేయాలని టిఎన్‌ఎస్‌ఎఫ్ నేతలు నినాదాలు చేశారు. తమ డిమాండ్లను వారం రోజుల్లోగా పరిష్కరించకుంటే లక్షమంది విద్యార్థులతో సిఎం కెసిఆర్ ఫాంహౌస్‌ను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.