ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-119

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. పవన్- త్రివిక్రమ్ -ఏ సినిమా కోసం?
2. మామ మంచు -అల్లుడు కంచు. వీడెవడండీ బాబూ?
3. ఉత్తమ గీతంగా జాతీయ అవార్డు అందుకున్న శ్రీశ్రీ పాట?
4. ఇద్దరూ ఇద్దరేలో ఒళ్లంతా వయ్యారమేనని శోభన్ చేత అనిపించుకున్న నటి?
5. కైకాలను మొరటోడుగా చూపించిన కమెడియన్, దర్శకుడు?
6. ఎన్టీఆర్ గిరీశం- సావిత్రి మధురవాణి. ఏ సినిమా?
7. అరకు రోడ్డులో..కి పులి ఎంటరైంది. ఏ హీరోయిన్ గుర్తుకొస్తుంది?
8. మహా స్పీడున్నోడు. త్వరలో ‘సీత’తో వస్తాడట. ఎవరబ్బా?
9. మధురానగరిలో సత్తిరాజు ఎవరు?
10. పక్కనున్న హీరోయిన్‌ను గుర్తుపట్టండి?

సమాధానాలు- 117

1. ఎమ్మెల్యే
2. చిత్తూరు నాగయ్య
3. నిష్కృతి
4. హనుమప్ప మునియప్ప రెడ్డి
5. భక్త ప్రహ్లాద
6. అనుష్క శెట్టి
7. ఘోర
8. జెకె భారవి
9. మజిలీ
10. ఆండ్రియా జెరెమియా

సరైన సమాధానాలు రాసిన వారు

పీవీఎస్ ప్రసాదరావు, అద్దంకి
పేర్ల సురేష్, ఒంగోలు
ఎస్‌ఎస్ హరి, బెంగళూరు
కేవీ శైలజ, అనంతపురం
బి రామ్మూర్తి, కర్నూలు
కేఎస్ తిరుమల, అల్లవరం
కె రుషి, భీమవరం
అల్లాడి శ్రీకర్, భీమునిపట్నం
ఎంవిఎస్ రెడ్డి, మల్లవరం
జీవీ సుధాకర్, యానాం
డి పల్లవి, నర్సాపురం
ఎన్‌ఎన్‌ఎస్ శర్మ, భీమవరం
హెచ్ సుధాకర్ గౌడ్, నల్గొండ
ఏ రత్నాకర్, తణుకు
గౌరీ సుప్రియ, తడ
ఆమంచి సుందరం, సికింద్రాబాద్
కవితారమేష్, సికింద్రాబాద్

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్