ఫిలిం క్విజ్

ఫిలింక్విజ్-162

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: రాణీప్రసాద్
*
డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ చిత్రం ఏ సినిమా వర్కింగ్ స్టిల్?
2. గోరొంక గూటికే చేరావు చిలుకా.. అంటూ దాగుడుమూతలు ఆడిన హీరో ఎవరు?
3. మొట్టమొదటిసారి కాంతారావు ఏ సినిమా కోసం నారద పాత్రలో కనిపించారు?
4. సీనియర్ హీరోయన్ టబు పూర్తిపేరు?
5. గండికోట రహస్యం చిత్రంలో రాజబాబు పేరు చాలా విలువైనది.. ఏమిటది?
6. ఇంత పెద్ద ప్రపంచంలో ఈరోజు వరకు నన్ను జడ్జి చేయండి నా కొడుకు ఒక్కడే. వాడి దృష్టిలో నేను కొంచెం తగ్గినా తట్టుకోలేను -అన్న పాపులర్ డైలాగ్ ఎందులోది?
7. స్వాతికిరణం చిత్రంలో వైష్టవి భార్గవి అన్న పాట పాడిన గాయని ఎవరు?
8. ఎన్టీ రామారావు తీసిన సీతారామ కల్యాణం చిత్రానికి సంభాషణలు అందించిన గొప్ప రచయిత?
9. కొంగర జగ్గయ్య నటించిన ఒకే ఒక తమిళ చిత్రం? రమ్యకృష్ణ పాపులర్ క్యారెక్టర్ పేరు?
10. పక్క ఫొటోలోని హీరోయిన్ ఎవరు?
*
సమాధానాలు- 160
*
1) శైలజారెడ్డి అల్లుడు 2) అనిత
3) ఆత్మగౌరవం 4) బాలకృష్ణ 5) సుమలత 6) మధుసూదనరావు 7) కెవి మహదేవన్ 8) ఎంవి రఘు 9) పట్టిన ప్రవేశం
10) కామ్న జెఠ్మలానీ
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
సిరం మల్లిక, అనకాపల్లి
జివీ రాఘవేంద్ర, నంధ్యాల
మేకా వరప్రతాప్, సింగరాయకొండ
సి అర్చన, సికింద్రాబాద్
ఎస్‌ఎస్‌ఎన్ రావు, వేళంగి
పి సురేంద్ర, డి గన్నవరం
లతీఫొద్దీన్ అహమద్, సుల్తానాబాద్
టి రమ్యదీప్తి, సత్తెనపల్లి
కెవియస్‌యన్ మూర్తి, హైదరాబాద్
ఎంవి భాస్కర్‌రెడ్డి, కుతుకులూరు
వి రామలింగాచారి, యాదగిరిగుట్ట
జివి మురళీమోహన్, ముచ్చుమిల్లి
యన్ శివస్వామి, బొబ్బిలి
ఆర్‌విసిహెచ్‌ఎన్ రావు, శ్రీకాకుళం
పివి శివప్రసాదరావు, అద్దంకి
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03