ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ -- 101

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2. విజయ్ దేవరకొండ గీత గోవిందం చిత్రానికి సినిమాటోగ్రాఫర్?
3. సెనే్సషన్ సృష్టించిన ఫిదా చిత్రంలో హీరోయిన్ భానుమతి తండ్రి పాత్రధారి?
4. ఛత్రపతిలో -వాడుపోతే వీడు, వీడుపోతే నేను. నేనుపోతే నా అమ్మ మొగుడంటూ.. అన్న పవర్‌ఫుల్ డైలాగ్ రాసిన రచయిత?
5. కలకానిది.. నిజమైనది అన్న పాటను వెలుగునీడలు చిత్రం కోసం రాసిన మహాకవి?
6. విజయావారి మాయాబజార్ చిత్రానికి స్క్రీన్ ప్లే రాసింది ఎవరు?
7. కమల్ ఆకలిరాజ్యం చిత్రానికి తమిళ టైటిల్?
8. కృష్ణవంశీ నక్షత్రం సినిమాలో సాయిధరమ్ తేజ్ పాత్ర పేరు?
9. 1972 బాలభారతం చిత్రానికి సంగీతం అందించిన దర్శకుడు?
10. పక్క చిత్రంలోని నటి ఎవరు?

సరైన సమాధానాలు రాసిన వారు:
=====================
జీవీ రాజా, కాజీపేట
ఆర్ విజయ, సంతమాగులూరు
బి రాజ్యలక్ష్మి, పెద్దాపురం
ఆర్ స్వర్ణలత, యాదాద్రి
కెఎస్ రామ్, పెనుమంట్ర
బీవీ చందర్, కాజ
వాణిశ్రీ, మహబూబ్‌నగర్
కె జయరామ్, హైదరాబాద్
డీఆర్ రావు, కాకినాడ
సిహెచ్ మల్లి,వైజాగ్
ఆర్ సుకుమార్, సికింద్రాబాద్
కేవీ రాజు, సూర్యాపేట
బళ్ల రాజు, కాచిగూడ
కె వనజ, వనస్థలిపురం
జ్యోతిర్మయ, విశాఖపట్నం
*

-- నిర్వహణ: రాణీప్రసాద్