ఫిలిం క్విజ్

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే... (ఫిలిం క్విజ్ 100)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్‌రామ్, సింధుతులానీ నటించిన సినిమా?
3. రవితేజ ‘బలుపు’ చిత్రానికి దర్శకుడు?
4. బాపు ‘రాధాగోపాలం’ చిత్రానికి సంగీత దర్శకుడు?
5. నారా రోహిత్ హీరోగా నటించిన ‘సోలో’ చిత్రంలో హీరోయిన్ ఎవరు?
6. ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రానికి మాటల రచయిత?
7. సావిత్రి హీరోయిన్‌గా నటించిన ‘నాదీ ఆడజనే్మ’ సినిమాకు నిర్మాత ఎవరు?
8. ‘ఎవ్వరో పాడారు భూపాలరాగం సుప్రభాతమై’ కోకిలమ్మ చిత్రానికి ఈ పాట రాసినది ఎవరు?
9. ‘నడిరేయి ఏ జాములో/ స్వామి నిను చేర దిగి వచ్చునో’ పాట ఏ సినిమాలోది?
10. పక్క ఫొటోలోని నటి ఎవరు?

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి