ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-97

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. మహేష్‌బాబుకు సీన్ వివరిస్తున్న సుకుమార్. ఏ చిత్రం వర్కింగ్ స్టిల్ ఇది?
2. గోరొంక గూటికే చేరావు చిలకా.. దాగుడు మూతలు చిత్రానికి పాట రాసిందెవరు?
3. రుస్తుం చిత్రంలో చిరంజీవి పాత్ర పేరు?
4. నాగార్జన డ్యూయల్ రోల్ చేసిన హలోబ్రదర్‌కు సంగీతాన్నిచ్చిన డ్యూయల్ దర్శకులు?
5. నన్ను దోచుకుందువటే.. సినిమా టైటిల్‌ను ఏ రచయత పాట నుంచి తీసుకున్నారు?
6. హాసినిగా మురిపించిన జెనీలియా తొలి హిందీ చిత్రం?
7. త్వరలో విడుదల కానున్న జూ.ఎన్టీఆర్ సినిమా అరవింద సమేత దర్శకుడు?
8. విశ్వనాథ్ సిరిసిరిమువ్వ చిత్రం పేరు ఆయన సినిమాలోనే ఓ పాటలో రిపీటెడ్‌గా వినిపిస్తుంది? ఏం సినిమా?
9. సుమంత్ హీరోగా వచ్చిన గోల్కొండ హైస్కూల్ చిత్రానికి దర్శకుడు ఎవరు
10. నేనో రకం అన్నట్టు ఎక్స్‌ప్రెషన్ పెట్టిన ఈ క్యూట్ హీరోయన్ ఎవరు?
*
సమాధానాలు- 95
*
1. జనతా గ్యారేజ్
2. ఎస్.పి.బాలు- రేణుక
3. వందేమాతరం శ్రీనివాస్
4. దేవిశ్రీ ప్రసాద్,
5. ప్రియమణి
6. ఎస్వీ కృష్ణారెడ్డి,
7. మురళి పరుచూరి
8. 1976,
9. త్రివిక్రమ్ శ్రీనివాస్ 1
0. శ్రీయ
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
ఎల్ అహ్మద్, సుల్తానాబాద్
జివిఎం మోహన్, ముచ్చుమిల్లి
టిఆర్ దీప్తి, సత్తెన్నపల్లి
ఎం దినేష్‌రెడ్డి, నెల్లూరు
కె మురళీకృష్ణ, చీరాల
ఎన్ లక్ష్మీరామం, సికింద్రాబాద్
బి జ్యోతిరాణి, రేణిగుంట
ఎండి ప్రసాద్ రెడ్డి, వరంగల్
పి రామకృష్ణ, ఆదోని
ఆర్‌విసిహెచ్‌ఎన్ రావు, శ్రీకాకుళం
పివిఎస్ రాజు, పాలకొల్లు
ఎల్‌కె చక్రవర్తి, విజయవాడ
బి కమల, పిఠాపురం
ఎస్ వేణుకుమార్, తుని
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36,
సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్