తెలంగాణ

నటుడు తారకరత్నకు రూ. 700 జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తాను నడుపుతున్న కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ తొలగించనందున సినీ నటుడు తారకరత్నకు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు సోమవారం 700 రూపాయల జరిమానా విధించారు. అదే రోడ్డులో వెళుతున్న విజయవాడకు చెందిన సబ్ కలెక్టర్‌కు కూడా ఇదే కారణంపై 700 రూపాయల జరిమానా విధించారు. కారు అద్దాలకు బ్లాక్‌ఫిల్మ్‌ను పోలీసులు స్వయంగా తొలగించారు. కొద్దిరోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా బ్లాక్‌ఫిల్మ్ తొలగించని కారణంగా జరిమానా విధించిన సంగతి తెలిసిందే.