తెలంగాణ

అగ్నిప్రమాదాలను పట్టించుకోని అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: జంట నగరాల పరిధిలోని పారిశ్రామిక వాడల్లో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. చిన్న, మధ్యతరహా రసాయన పరిశ్రమల యాజమాన్యాలు భద్రత చర్యలు పాటించకపోవడంవల్లనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. అగ్నిప్రమాదాలకు తోడు కాలుష్యం వెదజల్లుతోంది. తాజాగా ఆదివారం నాచారం-మల్లాపూర్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. పెద్దఎత్తున మంటలు ఎగసిపడుతుండడంతో అగ్నిమాపక అధికారులు ఫైరింజన్లతో మంటలనార్పారు. పరిశ్రమల్లో భద్రత చర్యలు పాటించడం లేదని ఫిర్యాదులు అందుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శ సర్వత్రా వినిపిస్తోంది.
రెండ్రోజుల క్రితం జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం సంభవించి దాదాపు 50 గుడిసెలు దగ్ధమయ్యాయి. రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో సుమారు 40 అటోలు దగ్ధం కాగా, వనస్థలిపురం, ఆటోనగర్‌లో రెండు లారీలు దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి..వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు స్పందించడంలేదని పలువురు విమర్శిస్తున్నారు. ప్రధానంగా పారిశ్రామిక వాడల్లో వేసవి దృష్ట్యా అగ్నిప్రమాదాలు జరుగుతాయని, పరిశ్రమల యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వేసవి తీవ్రతకు ముందే అగ్నిప్రమాదాలు సంభవిస్తే రాగల రెండు నెలల్లో ఇంకెన్ని ప్రమాదాలు సంభవిస్తాయోనని పారిశ్రామిక వాడల్లోని కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటిటైనా పారిశ్రామిక వాడల్లోని పరిశ్రమల యజమానులు భద్రత చర్యలు చేపట్టాలని, పరిశ్రమల కాలుష్యాన్ని అరికట్టాలని స్థానిక ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు.