మెదక్

మత్స్య పరిశ్రమ అభివృద్ధ్దికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయంపేట, డిసెంబర్ 18: తెలంగాణ ప్రభుత్వం మత్స్య పరిశ్రమ అభివృద్ధ్దికి పాటుపడుతుందని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయం వద్ద మత్య్స కార్మికులకు సబ్సిడిపై టాటా ఏసి వాహనాలను అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 21వాహనాలకు దరఖాస్తులు రాగా 7వాహనాలు మంజూరయ్యాయి. కొండపాక మండలం సిరిసనగండ్ల, మెదక్ మండలం భూర్గుపల్లి, రాజ్‌పేట గ్రామాల సభ్యులకు మూడు వాహనాలను అందజేశారు. ఈసందర్బంగా డిప్యూటి స్పీకర్ మాట్లాడుతూ సమైఖ్య రాష్ట్రంలో జరగని అభివృద్ది తెలంగాణ ప్రభుత్వ హయంలో జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా మత్య్స కార్మికులకు కమ్యూనిటి భవనాలు మంజూరు కాగా మెదక్ నియోజకవర్గానికి 6్భవనాలు మంజూరైనట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా కరువు ఏర్పడినందున ప్రభుత్వానికి మత్య్స కార్మికులు చెల్లించే లీజు పన్నును రద్దు చేయడం జరిగిందన్నారు. పేదల పక్షాన ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపిపి పుట్టి విజయలక్ష్మీ యాదగిరి, జెడ్పీటిసి బిజ్జ విజయలక్ష్మీ సంపత్, సర్పంచు పాతూరి ప్రభావతి, వైస్ ఎంపిపి జితెందర్‌గౌడ్, మత్య్స కార్మిక సంఘం జిల్లా అద్యక్షులుగున్నాల నర్సింలు, ఏడి లక్ష్మీనారాయణ, నాయకులు పుట్టి యాదగిరి, రమేష్‌రెడ్డి, బాదె చంద్రం, అంజాగౌడ్, పున్న వెంకటేశం, బసన్నపల్లి రాజుయాదవ్, ఆకుల మహేష్, సుదాకర్‌రెడ్డి, ఐలయ్య, సార్గు సత్యనారాయణ, గోపరి నర్సింలుతో పాటు తదితరులు ఉన్నారు.