బిజినెస్

భారత్‌కు ‘బిబిబి మైనస్’ రేటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయనా.. స్థిరమైన ఔట్‌లుక్‌ను ప్రకటించిన ఫిచ్

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్.. సోమవారం భారత్‌కు స్థిరమైన ఔట్‌లుక్‌తో ‘బిబిబి మైనస్’ రేటింగ్‌ను ఇచ్చింది. బిబిబి మైనస్ రేటింగ్ అనేది పెట్టుబడులకున్న చివరి అవకాశానికి గుర్తు. దీనికి దిగువన పెట్టుబడులకు ప్రతికూలమైన రేటింగే. కాగా, దేశంలో ఉన్న భారీ విదేశీ మారకద్రవ్య నిల్వలు, ఆశాజనకమైన జిడిపి వృద్ధిరేటు, అదుపులో ఉన్న ద్రవ్యోల్బణం వంటివి స్థిరమైన ఔట్‌లుక్‌ను ఫిచ్ చేత ఇప్పించాయి. ఈ మేరకు ఓ ప్రకటనలో ఫిచ్ రేటింగ్స్ స్పష్టం చేసింది. ఇకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2015-16లో భారత జిడిపి వృద్ధిరేటు 7.5 శాతంగా ఉండవచ్చని, వచ్చే ఆర్థిక సంవత్సరం 2016-17లో ఇది 8 శాతానికి పెరగవచ్చని ఫిచ్ అంచనా వేసింది. ‘్భరత్ సాధిస్తున్న జిడిపి వృద్ధిరేటు ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటిదాకా 1.25 శాతం మేర రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను తగ్గించింది. ఇది జిడిపి పురోగతికి దోహద పడుతోంది.’ అని ఫిచ్ తమ ప్రకటనలో పేర్కొంది. కాగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 23.6 శాతం వేతనాలను పెంచాలని ఇటీవల 7వ వేతన సంఘం చేసిన సిఫార్సు అమలైతే ద్రవ్యలోటు లక్ష్యాలు ప్రభావితం కావచ్చని ఫిచ్ అభిప్రాయపడింది.