రాష్ట్రీయం

టాస్క్ఫోర్స్‌కు చిక్కిన వజ్రపు శివలింగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కెట్ విలువ పదికోట్ల పైమాటే ఐదుగురి అరెస్టు

విజయవాడ , నవంబర్ 26: బ్లాక్ మార్కెట్‌లో సుమారు పది కోట్లరూపాయలకు పైనే విలువ చేసే వజ్రాలతో పొదిగిన ఐదు తలల శేషతల్ప పంచలోహ శివలింగం విజయవాడ టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కింది. నగరానికి చెందిన కొందరు వ్యక్తులు దీన్ని అమ్మకానికి పెట్టగా సమాచారం తెలుసుకున్న టాస్క్ఫోర్స్ వలపన్ని పట్టుకున్నారు. ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేయగా తెలంగాణా రాష్ట్రానికి చెందిన అసలు నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణా రాష్ట్రం నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన సైదులు అనే వ్యక్తి నుంచి సేకరించిన ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని నున్న ప్రాంతానికి చెందిన వై నర్శింహారెడ్డి, కేదారేశ్వరరావుపేటకు చెందిన ఎన్ వెంకట దుర్గాప్రసాద్, రామలింగేశ్వరనగర్‌కు చెందిన కె శివ నాగేంద్రరావు, వించిపేటకు చెందిన పి వెంకన్నబాబు, కృష్ణలంకకు చెందిన సిహెచ్ శ్రీనులు కలిసి ఈశివలింగాన్ని మార్కెట్‌లో అమ్మకానికి పెట్టారు. వాట్సప్ ద్వారా ఫొటోలు పంపుతూ కొనుగోలుదారుల కోసం అనే్వషిస్తున్న క్రమంలో సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ ఎస్‌ఐ సురేష్‌రెడ్డి ఈ ఐదుగురు వ్యక్తులను అజిత్‌సింగ్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో వలపన్ని పట్టుకున్నారు. ఐదుగురిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్టేషన్‌లో అప్పగించారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న ఐదు తలల పడగలో ఉన్న పంచలోహ శివలింగం మీద ఎం క్వాలిటీ 87 వజ్రాలు పొదిగి ఉన్నాయి. దీన్ని పురాతన శాఖకు పంపనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితులు పదికోట్ల నుంచి బేరమాడి కోటిన్నరకు ఒప్పందం కుదుర్చుకుని దొరికిపోయారు. నిందితుల నుంచి ఒక కారు, మూడు మోటారు సైకిళ్లు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న అసలు వ్యక్తి సైదులు కోసం గాలిస్తున్నారు. (చిత్రం) వజ్రాలు పొదిగిన శివలింగం