జాతీయ వార్తలు

ఆ ప్రమాదం.. మా నిర్లక్ష్యం వల్ల కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కోల్‌కతలో ఫ్లయ్ ఓవర్ కుప్పకూలిపోవడం అన్నది కేవలం ప్రమాదమేనని, ఇందులో తమ సంస్థ నిర్లక్ష్యం ఏమీ లేదని ఐవిఆర్‌ఎల్‌సి కంపెనీ ప్రతినిధులు శుక్రవారం ఇక్కడ మీడియాతో చెప్పారు. కోల్‌కతలో ఫ్లయ్ ఓవర్ కుప్పకూలిన దుర్ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని వారు అన్నారు. ఆ ఫ్లయ్ ఓవర్‌లో 59 పిల్లర్లకు ఎలాంటి సామగ్రి వాడామో 60వ పిల్లర్‌ను కూడా అంతే జాగ్రత్తగా నిర్మించామన్నారు. 60వ పిల్లర్ ఎందుకు కూలిందో విచారణలో తేలాల్సి ఉందన్నారు. ఈ ఘటనపై తమ కంపెనీ కూడా విచారణ చేస్తుందన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జరిపే విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామన్నారు. దశాబ్దాల కాలంగా తాము పలు రాష్ట్రాల్లో ఎన్నో నిర్మాణాలు పూర్తి చేసినా ఎక్కడా ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. ఫ్లయ్ ఓవర్ ఘటనతో తాము షాక్‌కు గురయ్యామన్నారు.