Others

చిలకా - గోరింక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచన: ఆత్రేయ
పాటలు: శ్రీశ్రీ
నృత్యం:
ధార్వార్ కృష్ణకుమార్, హీరాలాల్,
కళ: జివి సుబ్బారావు
ఎడిటింగ్: అక్కినేని సంజీవరావు
ఛాయాగ్రహణం: ఎంకె రాజు
సంగీతం: యస్ రాజేశ్వర్‌రావు
నిర్మాత, దర్శకులు: కె ప్రత్యగాత్మ
***
తాతినేని ప్రకాశరావు వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశారు ప్రత్యగాత్మ. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం భార్యాభర్తలు. ‘ఆత్మా ఆర్ట్స్’ నిర్మాణ సంస్థ ప్రారంభించి ‘చిలకా-గోరింక’ రూపొందించారు. ఈ చిత్రంతో తొలిసారి కృష్ణంరాజును చిత్రసీమకు పరిచయం చేశారు.

కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు కొల్లి ప్రత్యగాత్మ. విద్యార్థి దశలో రాజకీయాల్లో పాల్గొని, తరువాత ప్రజామిత్ర, జ్వాలా పత్రికా సంపాదకునిగా పనిచేశారు. నిరుపేదలు, మా ఇంటి మహాలక్ష్మి, తండ్రులు- కొడుకులు చిత్రాలకు రచన చేశారు. తాతినేని ప్రకాశరావు వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసి, దర్శకత్వం వహించిన తొలి చిత్రం భార్యాభర్తలు. ‘ఆత్మా ఆర్ట్స్’ నిర్మాణ సంస్థ ప్రారంభించి ‘చిలకా-గోరింక’ చిత్రాన్ని రూపొందించారు. హిందీలో 7 చిత్రాలు రూపొందించారు. వీటిలో తెలుగు ‘రాజు- పేద’ ఆధారంగా నిర్మించిన ‘రాజా అవుర్ రంక్’ హిందీ చిత్రం సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. వీరి సోదరుడు హేమాంబరధరరావు, కుమారుడు వాసు కూడా దర్శకులుగా ప్రతిభ చూపటం విశేషం. ‘చిలకా-గోరింక’ చిత్రం ద్వారా తొలిసారి కృష్ణంరాజును నటుడిగా చిత్రసీమకు పరిచయం చేశారు. ‘శభాష్‌సూరి’ చిత్రంలో చిన్నవేషం వేసిన రమాప్రభను పూర్తిస్థాయి హాస్యనటిగా ఇందులో అవకాశమిచ్చారు.
సంజీవరావు (ఎస్వీ రంగారావు), శాంత (అంజలిదేవి) అన్యోన్య, అనురాగబద్ధులైన దంపతులు. 60ఏళ్లు నిండిన సంజీవరావు 20ఏళ్ల కుర్రవానిలా హుషారుగా ఉంటాడు. 30ఏళ్లు నిండిన వారి దాంపత్యం చిలకా- గోరింకలా ఇతరులకు ఆదర్శంగా నిలిచింది. ఆ దంపతులకు పిల్లలు లేరు. లేకలేక కొన్నాళ్ళకు శాంత గర్భవతి అవుతుంది. తమ్ముడు సన్యాసిరావు (కాకరాల)కు, బంధువు పాపారావు (రమణారెడ్డి)కు సంజీవరావు కొంత ఆస్తిని వీలునామా రాస్తాడు. పాపారావు కుమారుడు రాజా (కృష్ణంరాజు) మంచివాడు, సహృదయుడు. పాపారావు కుమార్తె శశి (రమాప్రభ). వారి మేనత్త కూతురు లక్ష్మి (వాసంతి). వాసంతికి, రాజాకు పెళ్ళి చేస్తే ఆస్తి కలిసొస్తుందని భావిస్తాడు పాపారావు. కాని రాజా, తల్లి తప్ప మరెవరూ లేని భీమా ఏజెంటు ఉషాదేవి (కృష్ణకుమారి)ని ప్రేమిస్తాడు. రాజా మంచితనం తెలిసి ఉష కూడా అతన్ని ప్రేమిస్తుంది. ఒక ఆడపిల్లను ప్రసవించి శాంత మరణిస్తుంది. భార్య మరణించటంతో సంజీవరావు ఆ కుమార్తెను ద్వేషిస్తూ దూరంగా ఉంచుతాడు. నౌకరు నవాబు (చదలవాడ) ఆ పాప భారం వహిస్తాడు. వీరి ప్రక్కింటి వ్యక్తి సాగరయ్య (పినిశెట్టి) బహు కుటుంబీకుడు. వారి పెద్దకొడుకు భద్రం (పద్మనాభం), శశి ప్రేమించుకుంటారు. పాపారావుకి ఇష్టం లేకుండా భద్రం, శశి మెడలో తాళికడతాడు. అతని కోపానికి జడిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న భద్రాన్ని వాసంతి కాపాడుతుంది. రాజా, ఉషల ప్రేమ, ప్రణయం నచ్చని పాపారావు ఆమెను కారుతో గుద్ది యాక్సిడెంటు చేస్తాడు. ఫలితంగా అవిటిదైన ఉష, రాజాకు దూరంగా వెళ్ళి అనుకోకుండా సంజీవరావు ఇంటికి చేరుతుంది. తన మాటలతో, అతనిలో మార్పుతెస్తుంది. అలా కూతురి పట్ల మళ్లీ సంజీవరావు ప్రేమను పెంచుకుంటాడు. తండ్రి చెప్పిన మాటలు నమ్మిన రాజా.. సంజీవరావును ఉష పెళ్ళి చేసుకుంటుందని భ్రమపడతాడు. వాసంతి, సంజీవరావుల వల్ల నిజం తెలుసుకున్న రాజా, ఉష ఒకటికావటం, భద్రం, శశి జంటగా నిలవటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
హీరోగా తొలి చిత్రమే అయినా కృష్ణంరాజు ఎంతో ముచ్చటగా, అనుభవశాలిగా నటించి మెప్పించారు. సన్నని చిరునవ్వు ప్రత్యేక ఆకర్షణ అయ్యింది. హీరోయిన్‌ను తమాషాగా ఆట పట్టించటం, సాయపడటం, ఆమె దూరమయ్యాక విరహంలాంటి సన్నివేశాల్లో ఎంతో నిండుతనం చూపి ఆకట్టుకున్నారు.
భీమా ఏజెంటు ఉషాదేవి పాత్రలో కృష్ణకుమారి ఆకట్టుకున్నారు. సరదా, గాంభీర్యాన్ని సమపాళ్లలో చూపిస్తూనే, ఒక ఏజెంటు లక్షణాలు, యువతిగా మెలకువ, తనకు సాయపడిన వ్యక్తి మంచితనం సహృదయతకు మెచ్చి మనసర్పించటం లాంటి సన్నివేశాలకు నిండుతనం చేకూర్చారు. యాక్సిడెంట్ వల్ల అవిటితనంతో బాధపడుతూ తన నడకపట్ల మక్కువగల ప్రియునికి తన ఆచూకీ తెలియనీయకూడదని దూరంకావటం, అవిటితనం వున్నా ధైర్యంతో జీవించ నిశ్చయం, తన మాటలతో సంజీవరావులో మార్పు తేవటంలాంటి హృద్యమైన సన్నివేశాల్లో ఈజ్‌తో కూడిన నటనతో కృష్ణకుమారి అలరించారు.
భార్యపట్ల అనురాగం, శ్రద్ధ, ఆమె గర్భవతి అయినపుడు ఆందోళన, ఆమె దూరం కావడంతో విరక్తి, ఆపైన వివేకంగల వ్యక్తిగా ఉషాదేవి రాజాలను ఏకంచేయటం. చిలకా- గోరింక జంటకు అర్థం వివరించే పాత్రలో ఎస్వీ రంగారావు, గాంభీర్యం, అమాయకత్వం, పసివానిలా కొన్నిసార్లు, సర్వం కోల్పోయిన విరాగిలా ఇలా పలు భావాలను సన్నివేశావకు అనుగుణంగా పలికించి చూపించారు. అణకువ, వినయం, పతి పట్ల ప్రేమ, ఆరాధన గల స్ర్తిమూర్తిగా, గర్భవతి కాగా ఆనందం, భర్త ప్రవర్తనకు ఆందోళనకల పరిపూర్ణ ఇల్లాలిగా అంజలీదేవి మెప్పించారు. చిలకా -గోరింక చిత్రంలో సున్నితమైన, సహజమైన, ఆసక్తికరమైన సన్నివేశాలు దర్శకుని ప్రతిభకు అద్దంపడతాయి.
ఈ చిత్ర గీతాలు: పద్మనాభం, రమాప్రభలపై చిత్రీకరించిన హాస్య గీతం -చెంచాతో సముద్రాన్ని తోడశక్యమా, పైసాతో ప్రేమవిలువ కొలువ సాధ్యమా’ (మాధవపెద్ది, స్వర్ణలత); కృష్ణంరాజు, కృష్ణకుమారిలపై చిత్రీకరించిన ఆహ్లాదకర గీతం -నడూ నడూ నడచిరా/ హంసవలె నెమలివలె’ (జయదేవ్, పి.సుశీల) లాంటి గీతాలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఎస్వీ రంగారావు, అంజలిదేవిలు తొలిరేయినాటి మురిపెంను గుర్తు చేసుకుంటూ ఎస్వీఆర్ వీణ వాయిస్తూ.. అంజలీదేవి నునుసిగ్గు పలికిస్తూ చిత్రీకరించిన గీతం -నారాణి కనులలోనే/ ఆనాటి కలలు దాగే; ఎస్వీఆర్, కృష్ణకుమారి, బేబీలపై చిత్రీకరించిన గీతం -పాపా కథ విను/ బాగా విను విను’. ఈ రెండు గీతాల్లో ఎస్వీఆర్‌కు ఘంటసాల ప్లేబాక్ పాడటం, రెండో పాటలో పి.సుశీల బేబీ కౌసల్యతో గొంతు కలపటం విశేషం.
చిత్రంలో ఎస్వీఆర్ పొరుగింటి సాగరయ్యగా ప్రముఖ సినీ, నాటక రచయిత పినిశెట్టి శ్రీరామమూర్తి కనిపిస్తారు. జయాపజయాలతో సంబంధం లేకుండా దర్శకుడు ప్రత్యగాత్మ చేసిన మంచి ప్రయత్నంగా చిలకా -గోరిక చిత్రాన్ని చెప్పుకోవాలి.

-సివిఆర్ మాణిక్యేశ్వరి