ఫ్లాష్ బ్యాక్ @ 50

వీరకంకణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1907లో జన్మించిన టి.ఆర్.సుందరం, 1933లో సేలంలో ఏంజిల్ ఫిలింస్‌లో చేరి 1937లో దాన్ని కొని మోడరన్ థియేటర్స్‌గా మార్చారు. ‘సతీ అహల్య’తో నిర్మాతగా ప్రస్థానం ప్రారంభించి, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాలు రూపొందించారు. దక్షిణ భారతదేశంలో ఒకే పతాకంపై, 100 చిత్రాలు రూపొందించిన ఏకైక నిర్మాత టి.ఆర్.సుందరం.
మోడరన్ థియేటర్స్ పతాకంపై 1950లో తమిళంలో వీరు నిర్మించిన చిత్రం ‘మంత్రి కుమారి’. దీనికి దర్శకత్వం ఎల్లిస్ ఆర్ డంగన్, కథ-ఎం.కరుణానిధి, సంగీతం-జి.రామనాథన్, ఎడిటింగ్- ఎల్.బాలు. ఈ చిత్రంలో హీరోగా వీరమోహన్‌గా ఎం.జి.ఆర్ (ఎం.జి.రామచంద్రన్), హీరోయిన్‌గా జీవనరేఖగా జి.శకుంతల, రాజగురుగా నంబియార్, అతని కుమారుడు విలన్ పార్తీసన్‌గా ఎస్.ఎ.నటరాజన్, మంత్రికుమారి అంబుదవల్లిగా మాధురీదేవి నటించారు. 24న జూన్ 1950న విడుదలైన ఈ ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ తరువాత మోడరన్ థియేటర్స్ బేనర్‌పై మంత్రి కుమారి చిత్రాన్ని ‘వీరకంకణం’గా తెలుగులో టి.ఆర్.సుందరం నిర్మించారు. 1957 రాజగురువు విసిరిన కత్తిపోటుకు బలై మరణిస్తుంది. రాకుమారి, వీరమోహన్ తదితరులు ఆమె శిలావిగ్రహం ముందు నివాళి అర్పించటంతో చిత్రం ముగుస్తుంది. వీరమోహన్ స్నేహితుడు కైలాసంగా రేలంగి, అతని భార్య చంపగా గిరిజ, అతని తల్లిగా రమాదేవి, చంద్రసేనుని అనుచరుడు పాతాళంగా పేకేటి శివరాం, నర్తకిగా ఇ.వి.సరోజ నటించారు.
వీరమోహన్‌గా ఎన్.టి.రామారావు, ఒక సేనాధిపతిగా బాధ్యత, పరాక్రమం, విధేయత, అన్యాయాన్ని ఎదిరించే సాహసం, రాకుమారి పట్ల ప్రేమ, ఆరాధన, ఆమె దూరమైన వేదన ఎంతో వైవిధ్యభరితమైన నటన చూపారు. రాకుమారి రజనిగా కృష్ణకుమారి పాత్రోచితమైన దర్పాన్ని, నెమ్మది, నిండుతనాలను అతి సున్నితంగా, చంద్రసేనుని నిలవరించటంలో ఆవేశాన్ని, నిబ్బరంతో నటించారు.
చంద్రసేనుడిగా జగ్గయ్య విలనినీ, నయవంచనను ఆకట్టుకునే రీతిలో ప్రదర్శించగా, సాత్విక పాత్రల పోషణలో, పేరుపడ్డ నటులు గుమ్మడి వెంకటేశ్వరరావు రాజగురువుగా, నెగెటివ్ టచ్‌గల పాత్రను ఎంతో సమర్థవంతంగా మెప్పించటం విశేషం. ఇక మంత్రికుమారి పార్వతిగా జమున, మగవారితో సమానంగా ఆడది సబల అని నిరూపిస్తూ వీరకంకణం ధరిస్తూ ‘‘ప్రమాదమున దేశమున్న ప్రాణమైనా ఇచ్చుటలో ఆడువారు వెనుకాడరు’’ అంటూ పాటలోనే కాక, భర్తను ఎదిరించటంలో, చివరిలో భర్తను అంతం చేసి, రాజసభలో నిజం వెల్లడించటంలో పరిపూర్ణమైన నటనను చిరకాలం గుర్తుండిపోయేలా ప్రదర్శించారు. తమిళ చిత్రం టైటిల్ ‘మంత్రి కుమారి’కి తగ్గట్టుగా తెలుగు చిత్రంలోనూ ఆమె పాత్ర ప్రాధాన్యాన్ని చూపటం, జమున దానికి తగ్గ అభినయం చూపటం కంకణంలో టైటిల్స్ ప్రదర్శింపబడే ఈ చిత్రంలో కథ, మాటలు, పాటలు- ఆరుద్ర, ఎడిటింగ్- యల్.బాలు, ఫొటోగ్రఫి-జి.ఆర్.నందన్, సంగీతం-సుసర్ల దక్షిణామూర్తి, స్టంట్స్- ఫంటు, సోము, నృత్యం-వి.పి.బలరాం, ఎ.కె.చోప్రా, చిన్ని సంపత్, కళ-ఎ.జె.డొమ్మిక్, సి.కె.జాన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:జి.ఆర్.రావు.
మల్లె దేశపు మహారాజు వెంగళరాయ దేవుడు (రమణారెడ్డి) ఆ దేశానికి మంత్రి సత్యకీర్తి (కె.వి.ఎస్.శర్మ), రాజగురువు (గుమ్మడి)లపై ఆధారపడి పరిపాలన చేస్తుంటాడు. రాకుమారి రజని (కృష్ణకుమారి), మంత్రి కుమార్తె పార్వతి (జమున) స్నేహితులు. సేనాపతి వీరమోహన్ (ఎన్.టి.రామారావు). వీరమోహన్, రజని ప్రేమించుకుంటారు. వీరమోహన్ చేతిలో భంగపడిన రాజగురువు కుమారుడు చంద్రసేనుడు (జగ్గయ్య) రాజ్యం చివర కొండల్లో చేరి బందిపోటు దొంగతనాలు చేస్తూ అరాచకం సృష్టిస్తుంటాడు. రాకుమారిపై ఆశపడి, మంత్రి కుమారిని ప్రేమించినట్లు వంచిస్తాడు. సేనాని వీరమోహన్ చేతిలో బంధింపబడి, మరణశిక్షకు బలి అవుతున్న చంద్రసేనుని పార్వతి అబద్ధపు సాక్ష్యంతో రక్షిస్తుంది. వీరమోహన్ రాజ్యబహిష్కరణకు గురవుతాడు. రాకుమారి అతని వెంటే వెళుతుంది. చంద్రసేనుని పెళ్లాడిన పార్వతి, పెళ్లి తరువాత అతడు మారతాడని ఆశిస్తుంది. కాని చంద్రసేనుడు రజనిని బంధించి వశం చేసుకోబోగా, మారువేషంలో వెళ్లి అతన్ని ఎదిరించి, రాకుమారిని రక్షిస్తుంది. పార్వతిని అంతం చేయాలనుకుని, కుట్రతో చంద్రసేనుడు మలయ పర్వతాలకు తీసుకువెళతాడు. అతని, అతని తండ్రియొక్క కుట్రను తెలుసుకున్న పార్వతి, తెలివిగా చంద్రసేనుడి పర్వతంపైనుంచి త్రోసివేస్తుంది. రాకుమారి కోసం, అంతఃపురం ప్రవేశించి శిక్షకు గురవుతున్న వీరమోహన్‌ను విడిపించి మహారాజుకు సభాసదులకు చంద్రసేనుడు, రాజగురువుల కుట్రను వెల్లడిస్తుంది. దర్శకులు జి.ఆర్.రావు సన్నివేశాలను తెలుగు నేటివిటీకి తగిన విధంగా కొద్ది మార్పులతో చిత్రాన్ని తీర్చిదిద్దారు.
‘వీరకంకణం’లోని గీతాలు, వీరకంకణాలు ధరించి ఎన్.టి.ఆర్, జమునల, సైన్యం దోపిడీ దొంగలను అంతం చేయబోయే టైటిల్ సాంగ్ ‘కట్టండి వీర కంకణం, కంకణం’ (ఎ.ఎం.రాజా, జిక్కి బృందం), రేలంగి, ఎన్‌టిఆర్ బృందంపై గీతం ‘అంతా బలే రాంచిలకా’ (పిఠాపురం బృందం), ఎన్‌టిఆర్, కృష్ణకుమారిలపై తోటలో గీతం ‘అందాల రాణి ఎందుకోగాని’ (ఎ.ఎం.రాజా, ఆర్.బాలసరస్వతీదేవి), రేలంగి-గిరిజలపై గీతం ‘ఇంటికి పోతాను నేను ఇకపై రాను’ (స్వర్ణలత, పిఠాపురం), జమున, కృష్ణకుమారి చెలులపై గీతం ‘సిగ్గులు చిగురించెనే బుగ్గలు ఎరుపెక్కెనే’ (ఆర్.బాల సరస్వతీదేవి బృందం), కృష్ణకుమారి, చెలులపై నృత్యగీతం ‘ఇక వాయించకోరుూ మురళీ’(పి.లీల బృందం), జగ్గయ్య డెన్‌లో ఇ.వి.సరోజ నృత్యగీతం ‘సొగసరి కులుకు సొంపారు బెళుకు’(జిక్కి), చిత్రం చివరి గీతం ‘ఆత్మబలి చేసినావు’ (పి.లీల)- ఇక ఈ చిత్రంలోని ఘంటసాల, జిక్కిలు ఆలపించిన రెండు గీతాలు జగ్గయ్య, జములపై చిత్రీకరణ నదిలో నావలో ప్రణయగీతం ‘తేలి తేలి నా మనసు తెలియకనే’, మరో గీతం మలయ పర్వతాలపై ఎక్కుతుండగా ‘రావే రావే పోవు స్థలం మతి చేరువయే’ (తమిళ చిత్రంలో వారే వారే గీతం స్థాయిలో సాగటం విశేషం).
రచయిత ఆరుద్ర సన్నివేశాలకు తగ్గ భావయుక్తమైన పదునైన సంభాషణలు, గీతాలతో ‘వీరకంకణానికి’ శోభను కూర్చారు. జనరంజకమైన జానపద చిత్రంగా వీరకంకణం నిలవటం ఆనందదాయకం. టైటిల్ సాంగ్‌లో తెలుగుశక్తి, తెలుగు కీర్తి నిలపటం, చాటటం పదాలు, నేటికీ ఉత్తేజాన్ని కలిగించటం తెలుగువారికి గర్వకారణం.

-సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి