ఫ్లాష్ బ్యాక్ @ 50

‘ధర్మదేవత’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలుదాసు పుల్లయ్య (పి.పుల్లయ్య) నెల్లూరులో 1911లో జన్మించారు. కళల పట్ల ఆసక్తి. బి.ఏ. చదివిన తరువాత, స్నేహితులతో కలిసి, ‘కొలంబియా’వారికి గ్రామఫోను పాటలు పాడారు. మిత్రులతో కలిసి కొల్హాపూర్‌లో స్టార్ కంబైన్స్ అనే ఫిలిం కంపెనీ ద్వారా హరిశ్చంద్ర (1935) నిర్మించారు. కొంతకాలం బొంబాయిలో అనుభవం సంపాదించారు. ఆ తరువాత స్టార్ కంబైన్స్ వారు పి.పుల్లయ్య దర్శకత్వంలో ‘సారంగధర’ నిర్మించారు. అందులో ‘చిత్రాంగి’గా నటించిన నటి శాంతకుమారిని వివాహం చేసుకున్నారు.
వీరిరువురూ కలిసి కొంత పేరు సంపాదించుకున్నాక, సంగీత దర్శకుడు భీమవరపు నరసింహారావుతో కలిసి రాగిణి ఫిలింస్ స్థాపించారు. ‘1948లో భక్తజనా తమిళం’ చిత్రం రూపొందించారు.
తెలుగులో రాగిణి ఫిలింస్ పతాకంపై తొలిసారి ‘తిరుగుబాటు’ (1950) ఆ తరువాత 1952లో ‘్ధర్మదేవత’, అర్ధాంగి (1955) తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు.
‘్ధర్మదేవత’ చిత్రానికి కథ, మాటలు-త్రిపురనేని గోపిచంద్, ఛాయాగ్రహణం- మాధవ్‌బుల్‌బులే, సంగీతం- సి.ఆర్.సుబ్బరామన్, కళ- ఎస్.వి.ఎస్.రామారావు, యల్.వి.మాండ్రీ, నిర్మాత- దర్శకుడు: పి.పుల్లయ్య, పాటలు-సముద్రాల సీనియర్, గోపాలరాయశర్మ.
ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె.వి.రెడ్డి స్క్రీన్‌ప్లే వ్రాయటం, విశేషం. మొదట ఈ చిత్రానికి హీరోగా అక్కినేని నాగేశ్వరరావును నిర్ణయించి, కారణాంతరాల వలన ఆయన విరమించుకోవటం, అందుచేత నిర్మాతలు, నూతన నటుడు కౌశిక్‌ను హీరోగా నిర్ణయించారు. కౌశిక్ పొద్దుటూరు ప్రాంతానికి చెందినవాడు కావటం, తొలిసారే హీరోగా ఛాన్స్ పొందటం విశేషం. కె.వి.రెడ్డిగారి సూచనతో హీరోయిన్‌గా గిరిజను ఎన్నుకున్నారు.
ధర్మదేవత జానపద చిత్రం. వీరసేనుడు (లింగమూర్తి), ఉజ్జయిని రాజ్యాధినేత. అతని కూతురు స్వర్ణ(బేబి సరస్వతి) తల్లి లేని పిల్ల, అపురూపంగా పెంచుతుంటాడు. చంపాదేవి (లక్ష్మీప్రభ) అనే వేశ్యతో కలిసి రాజమందిరంలో జీవిస్తూ ప్రజలను దయాదాక్షిణ్యాలు లేకుండా, హింసిస్తూ, పాలిస్తుంటాడు. రాజ్యానికి పొరుగునవున్న గ్రామానికి చెందిన రఘునాథశర్మ (ముక్కామల), అక్క కాత్యాయిని (శాంతకుమారి), కొడుకు గోపాల్ (కందామోహన్), బావ వైద్యంకోసం, ఉజ్జయినికి, మేనల్లుడుతో వచ్చిన రఘునాథ్, ఓ వీధి నర్తకి బిజిలి (లలిత) తల్లి, మహారాజు రథచక్రం కిందపడి మరణించగా, మహారాజును ఎదిరిస్తాడు. బాలుడు గోపాల్ విసిరిన రాయి, మహారాజుకు తగలటంతో మహారాజు బాలుని సింహాలకు వేయమని సర్వాధికారి (దొరస్వామి)కి ఆజ్ఞ ఇస్తాడు. రఘు, అతని బావల ప్రార్థన మహారాజు మన్నించాడు. రఘునాథ్ మహారాజు సైన్యంతో పోరాడి మేనల్లుడు మరణించినందుకు ప్రతీకారంగా రాకుమార్తె స్వర్ణను అపహరించి, అక్కవద్దకు తెచ్చి బావ, మేనల్లుడుకోసం, ఈమెను హతమారుస్తానంటాడు. రాజభటులు వచ్చి, రఘుపై ఇంటివద్ద దాడి చేయగా, కాత్యాయిని పాపతో తప్పించుకునిపోయి రత్నగిరి అనే పల్లెలో సంజీవి తాత (బి.నరసింహారావు) వైద్యంతో గతం మరచిన పాపను తన పాపగా పెంచి పెద్ద చేస్తుంది. వాసంతి (గిరిజ)గా ఎదిగిన రాకుమారిని ఒకనాడు శూరసేనుడు(కౌశిక్) అనే యువకుడు రక్షిస్తాడు. వారిరువురూ ప్రేమించుకోవటం, ఉద్యోగంకోసం ఉజ్జయిని వెళ్ళిన శూరసేనుడు, వీరసేనుని సేనానిగా నియమించబడి, రఘునాథశర్మను పట్టుకోవాలన్న మహారాజు ఆదేశంపై, అతని రహస్య స్థావరాన్ని ముట్టడించి, రఘునాథ్‌ను బందీగాతెస్తాడు. రాకుమారి స్వర్ణ గురించి అడుగగా, తనకి తెలియదని చెప్పటంతో వీరసేనుడు అతన్ని చంపబోగా, కాత్యాయిని వచ్చి, వాసంతీ, స్వర్ణ అని తెలియచేస్తుంది. ఆమె కుమారుడు గోపాల్‌ను తాను కాపాడి, కాశి నగరంలో పెంచి పెద్దచేశానని, అతడే శూరసేనుడు అని మహారాజుకు అందరికి తెలియచేస్తాడు. వీరసేనుడు పశ్చాత్తాపంతో రఘునాథశర్మను క్షమించమని కోరి, శూరసేనుడు, వాసంతిల వివాహం జరిపి వారికి రాజ్యభారం అప్పగిస్తాడు.
ఈ చిత్రంలో, వేశ్య చంప కొడుకు ఏకదంతుడుగా నల్లరామ్మూర్తి, శూరసేనుని బంటుగా వంగర, గొల్లగూడెంలో పూలరంగడిగా రేలంగి, కోయ పిల్ల బిజిలిగా లలిత ఇతరులు నటించారు.
నూతన నటుడైన కౌశిక్, శూరసేనుడుగా శౌర్య, ప్రతాపాలు వాసంతితో ప్రేమ, మహారాజు వీరసేనుని పట్ల గౌరవం, తన మేనమామ అని తెలియకపోయినా ఒక నిర్దోషిని బంధించానని తల్లి కాత్యాయినివల్ల తెలిసి, అతన్ని విడిపించి, మహారాజును ఎదిరించి అతని దండనకు సిద్ధపడడం, బిజిలి (లలిత)తో ఆడ వేషంలో, ఆమె మగ వేషంలో వుండగా కవ్వించే గీతంలో అభినయం చాలా ముచ్చటయైన నటన చూపారు.
కొంత అమాయకత్వం, గడుసుతనం, హుషారుగా, చలాకీగా, సన్నివేశానుగుణమైన పల్లెపడుచు, గొల్ల యువతిగా గిరిజ ఎంతో సహజంగా నటించింది. ఆమెను ప్రేమించానని, వెంటపడి, వెంపర్లాడే, మరో గొల్ల యువకుడు పూలదండగా రేలంగి, స్వర్ణను చిన్ననాటినుంచి కాపాడి పెంచిపెద్దచేసిన సంజీవి తాతగా బి.నరసింహారావు, స్వరాధికారంగా దొరస్వామి, అతని భార్యగా రమాదేవి పాత్రోచితంగా మెప్పించారు.
దర్శకులు పి.పుల్లయ్య సన్నివేశాలను అర్ధవంతంగా రూపొందించి, అలరించేలా తీర్చిదిద్దారు. రాజవీధిలో రథంక్రింద ఓ వనిత పడి మరణించటం, దానికి రఘునాథ్, మేనల్లుడు గోపాల్ స్పందన- పుత్రభిక్షకై గోపాల్ తండ్రి వేడుకోలు, వీరసేనుని క్రూరత్వం, భేషజం, రఘునాథశర్మ, సైన్యంతో వీరోచిత పోరాటం, వివిధరకాలుగా చూపటం, ఒకచోట గోడపై ‘రఘు’నిలవటం, ఇక గోపాలుడే శూరసేనుడిగా పెరిగాడని, చివర సర్వాధికారిగా చూపేవరకూ ప్రేక్షకులకూ సస్పెన్స్, బిజిలి సాయంతో కొండగుహలో రఘునాథశర్మ స్థావరం, చివర శూరసేనుడు అచటినుంచి తప్పించుకోవటం జలపాతంలోకి దారి ఎంతో విపులంగా ఆకట్టుకునే రీతిలో చిత్రీకరణ, తొలుత రాకుమారి, జడుపువలన గతం మరిచిపోయి, శాంతకుమారినే తల్లిగా భావించి పెరగటం, కుమారునికోసం శాంతకుమారి ఆర్తి దానిని చిత్రం చివరివరకూ ఎంతో హృద్యంగా చిత్రీకరించటం, దానిని ఆమె ఎంతో యుక్తవంతంగా నటించటం, ధర్మదేవత టైటిల్ జస్ట్ఫికేషన్ చిత్రం ఆద్యంతం అలరించేలా సాగటం విశేషం.
ధర్మదేవత చిత్ర గీతాలు: లలిత బృందంపై వీధిలో స్వరగీతం లంబాడి, లంబాడి, లంబ, లంబ, లంబ (కె.రాణి బృందం) శాంతకుమారి, స్వర్ణతో పాడే జోలపాట ‘మీవంటిదేనండి, మా కన్యపాప దీవింపరారండి’ (పి.శాంతకుమారి) గొల్లవారు, రేలంగి, గిరిజలపై వెనె్నల గీతం ‘విరిసే వెనె్నలలో వెంట జంట ఉండాలోయి’(రేలంగి, కె.ప్రసాదరావు, జిక్కి) మగవేషంలో లలిత, ఆడ వేషంలో కౌశిక్‌లపై గీతం ‘ఏ ఊరే చిన్నదానా’ చంపావతిపై గీతం-‘వలచి పిలుచునోయి వయ్యారి చిన్నది’ రేలంగిపై గీతం ‘బంతిపూల రంగయో, నీకింత’ (గానం రేలంగి). ఈ చిత్రంలోని పై గీతాలతోపాటు మరో మధుర గీతం, బి.ఎన్.ఆర్, బేబీ మరియు గిరిజలపై చిత్రీకరణ ‘చిందువేయవోయి చిన్నకృష్ణయ్య’ (బి.ఎన్.ఆర్, జిక్కి, కె.రాణి). ఈ గీతాలను సముద్రాల సీనియర్ వ్రాసారు. కొండముది గోపాలరాయశర్మ వ్రాసిన గీతాల్లో లలితపై ‘పాటకుపల్లవి కావాలోయ్’ (కె.రాణి) కౌశిక్, గిరిజలపై ఆహ్లాదకర యుగళగీతం ‘హారుూ వసంతము కాదా నేడే ఆనందమాయె’ (కె.ప్రసాదరావు, జిక్కి) సి.ఆర్.సుబ్బరామన్ స్వరాలతో అలరించేసాగాయి.
ఈ చిత్రంలో మొత్తం 13 పాటలలో 8 సముద్రాలవారు మిగిలిన 5 కొండముది గోపాలరాయశర్మ వ్రాసారు.
రాగిణి ఫిలిమ్స్ బేనర్ పి.పుల్లయ్యవారు రూపొందించిన ‘్ధర్మదేవత’ చిత్రం మే 14న, 1952 సం.విడుదలయి సక్సెస్ సాధించింది. బిగువైన, కథాకథనాలతో చక్కని పాటలు, జానపద చిత్రానికి కావలసిన కత్తియుద్ధాలు వంటి అనువైన అంశాలు, చిత్ర విజయానికి కారకులయ్యాయి.

--సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి