ఫ్లాష్ బ్యాక్ @ 50

బాంధవ్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్.వి.రంగారావు (సామర్ల వెంకట రంగారావు) 03-07-1918న నూజివీడులో సామర్ల కోటేశ్వరరావు, లక్ష్మీ దంపతులకు జన్మించారు. బి.ఎస్.సి చదివి, కాకినాడ యంగ్‌మెన్స్ హ్యాపీక్లబ్‌లో పలు నాటకాలు ప్రదర్శించారు. వీరి బంధువు రామానందం నిర్మించిన ‘వరూధిని’ చిత్రం ద్వారా హీరోగా సినీ రంగానికి పరిచయమయ్యారు. ఆ చిత్రం సక్సెస్ కాకపోవటంతో కొంత విరామం తరువాత పల్లెటూరిపిల్ల, షావుకారు చిత్రాల్లో ముఖ్య భూమికలు పోషించిన వీరు నటించిన ‘పాతాళ భైరవి’ లోని నేపాళ మాంత్రికుని పాత్ర, ఎస్.వి.రంగారావు నట జీవితాన్ని ఓ గొప్ప మలుపుతిప్పటంతో, ఆ తరువాత వీరు తమిళ, హిందీ, తెలుగు భాషల్లో శతాధిక చిత్రాలల్లో నటించి, తిరుగులేని నటునిగా ఖ్యాతిని పొందారు. విశ్వనట చక్రవర్తి ఎ.వి.యమ్. వారితో కలిసి నాదీఆడజనే్మ నిర్మించిన వీరు స్వంతంగా యస్.వి. ఆర్.్ఫలిమ్స్ బ్యానర్‌పై బడేటి సత్యనారాయణ, పుట్టా వెంకట్రావులతో కలిసి స్వీయ దర్శకత్వంలో రెండు చిత్రాలు రూపొందించారు. చదరంగం (1967), బాంధవ్యాలు (1968).
బాంధవ్యాలు టైటిల్‌పై పూలజల్లులు కురుస్తుండగా, సాంకేతిక వర్గం పేర్లు మొదలవుతాయి. ఈ చిత్రానికి కథ-కె.ఎస్.గోపాలకృష్ణన్, మాటలు- డి.వి.నరసరాజు, కళ-వి.బి.రాజు, కూర్పు-ఎన్.ఎస్. ప్రకాశం, నృత్యం-వేణుగోపాల్, సంగీతం-సాలూరి హనుమంతరావు, దర్శకత్వం- ఎస్.వి.రంగారావు, నిర్మాతలు- బడేటి సత్యనారాయణ, పుట్టా వెంకట్రావు, టైటిల్స్ పక్కనే చిత్రంలో వచ్చే ముఖ్య సన్నివేశాలను రేఖా చిత్రాలలో చూపటం విశేషం. రామయ్య (ఎస్.వి.రంగారావు) ఆ గ్రామంలో మోతుబరి రైతు. అతనికొక కుమారుడు చంద్రం (ఏడిద నాగేశ్వరరావు) కళ్ళులేకపోయినా చాపలు అల్లటం అతని నేర్పు. రామయ్య తమ్ముడు లక్ష్మయ్య (్ధళిపాళ) మరదలు అన్నపూర్ణ (సావిత్రి), వారి కూతురు లక్ష్మి(లక్ష్మి) కుమారులు ముగ్గురు, రామేశం (మోదుకూరి సత్యం), కామేశం, సోమేశం (సారధి) మగపిల్లలు పట్నంలో చదువుతూ, విలాసాల్లో గడుపుతూ, పరీక్షల్లో ఫెయిలవుతూంటారు. వారి ఎదురింటి వ్యక్తి పానకాలస్వామి (రాజనాల), అతని తమ్ముడు సూర్యం (చంద్రమోహన్) బుద్ధిమంతుడు. అన్నగారు చేసే అక్రమ వ్యాపారాలు, వ్యవహారాలు నచ్చక, రామయ్యవద్ద పాలేరుగా పనిచేస్తుంటాడు. లక్ష్మి, సూర్యం ప్రేమించుకుంటారు. లక్ష్మయ్యకు ఇది నచ్చదు. కొడుకులు అప్రయోజకులయినా వారిపట్ల ప్రేమ ఎక్కువ. ఇది అలుసుగా తీసికొని పానకాలు, ఈ అన్నదమ్ములచేత ఒక కారు కొనిపించి, అలాగే ఆస్తి హామీ సంతకం 2 లక్షలకు పెట్టించి వారిని అందులో ఇరికించి, పోలీసులచే అరెస్ట్‌చేయిస్తాడు. పిల్లల కారణంగా, రామయ్య ఆస్తిని పంచి కొడుకుతో వేరుగా వుంటాడు. తన పిల్లలు అరెస్ట్‌కాగానే లక్ష్మయ్య అన్నగారిని తిరిగి ఇంటికి తీసుకువస్తాడు. రామయ్య సాయంతో, చదువుకున్న పాలేరు భూషయ్య కొడుకు గోపాలం (హరనాథ్) వకీలు కావటంతో ఈ రెండు కేసులను సమర్ధవంతంగా వాదించి, రామేశం వగైరాలను నిర్దోషులుగా విడుదల చేయిస్తాడు. వారికి బుద్ధిరావటం, లక్ష్మి, సూర్యంల వివాహం నిశ్చయం కావటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో రాజనాల, సహాయకుడు శఠగోపంగా అల్లు రామలింగయ్య, డాక్టర్ ఆచార్యులుగా నాగయ్య, మస్తానుగా సీతారాం, పి.జె.శర్మ, కోళ్ళ సత్యం, పొట్టి లక్ష్మి నటించారు. అనుబంధాలకు, అన్యోన్యతకు, బాధ్యతలకు ప్రాధాన్యతనిస్తూ, క్రమశిక్షణతో సున్నితమైన అంశాలను ఎలా పరిష్కరించాలో తెలియచేసే చక్కని కుటుంబ కథాచిత్రం బాంధవ్యాలు. ఇంటి పెద్ద రామయ్యగా ఎస్.వి.రంగారావు. ఆ పాత్రకు తగిన వైవిధ్యాలను, దయ, కోపం, క్షమ, శాంత లక్షణాలను సన్నివేశానుగుణంగా నటనలో చూపి మెప్పించారు. అన్నగారు చెప్పినట్టు చేయటం తప్ప, స్వంత ఆలోచన లేని తమ్మునిగా, పిల్లలు అప్రయోజకులైన వారిపట్ల మమకారం, జాలి, బాధ్యతగల తండ్రిగా ‘్ధళిపాళ’చెప్పుకోదగ్గ నటన చూపారు. అతి మంచితనం, మెతకతనం, అర్ధంలేని ఆవేదన, మగ పిల్లల పట్ల వివక్షత గల భర్తతో, ఆడ పిల్ల లక్ష్మిని, మగ పిల్లల ప్రవర్తన హెచ్చరించే తల్లిగా, బావగారి ఆరోగ్యం పట్ల, కుటుంబం ఎడల శ్రద్ధగల ఇల్లాలు, అన్నపూర్ణగా సావిత్రి ఎన్నదగిన నటనతో ఆకట్టుకుంది.
దర్శకునిగా ఎస్.వి.రంగారావు చిత్రాన్ని ఆకట్టుకునే రీతిలో చిత్రీకరించారు. తొలుత రైతు కూలీల పాటతో చిత్రం ప్రారంభం. ‘మా రైతు బాబాయో మా మంచివాడయో’ (గానం ఘంటసాల, యల్.ఆర్.ఈశ్వరి బృందం- కొసరాజు). పాటలో పొలం పనులు, అన్నదమ్ముల పరిచయం చూపటం. కూలీ ధాన్యం దొంగిలించగా, తమ్ముడు అతన్ని కొట్టడం, పనిలోంచి తీసేయటం, ‘ఒక తప్పుకు రెండు శిక్షలు అని తమ్ముని చాటుకి పిలిచి చెప్పటం, ‘కూతురు లక్ష్మితో, సూర్యం చనువుకు తమ్ముడు అతన్ని దండించగా, సున్నితంగా ఆ విషయం పరిష్కరించాలని బోధించటం, ‘నా కన్నబిడ్డ నీకేం’ అని ధూళిపాళ మాటకు ఎస్.వి.ఆర్. రియాక్షన్. ఆస్తి పంపకం సన్నివేశం ఎంతో విపులంగా చిత్రీకరణ. అన్నగారు ఇల్లువదిలి వెళుతుంటే పానకాలు స్పందన, తమ్మునితో మరదలు, బావగారిని పిలవమనగా ధూళిపాళ జవాబు, తమ్ముని ఆరోగ్యం బాగాలేదని వచ్చిన అన్నను వెళ్ళిపొమ్మని తమ్ముడు చెప్పటం. అంతకుముందు బావగారి ఆరోగ్యంకోసం మరదలు తీసుకున్న చర్యలు, మాటలు, రామయ్య అపార్ధంచేసుకొని కోపంతో ఇల్లువదిలి వెళ్ళబోవటం, సాధారణంగా, గృహాలలో జరిగే విషయాలు ఎంతో సున్నితంగా విపులంగా చిత్రీకరించి ఆకట్టుకున్నారు. అలాగే రామేశం వాళ్ళు సంతకంచేసే సమయంలో మందు బాటిల్స్, డాన్స్, ఆడపిల్లలు మ్యూజిక్‌కు తగ్గట్టు రాజనాల టైపుచేయటం వెరైటీగా చూపారు. పాటకు తగ్గట్టు ఆధునికంగా చిత్రీకరణ సాగింది. ‘కనులే కలుపుదాం వలపే తెలుపుదాం’ (యల్.ఆర్.ఈశ్వరి బృందం).
నటి లక్ష్మికిది తొలి చిత్రం అయినా ఎంతో సహజమైన నటన చూపటం, చంద్రమోహన్ అన్నను ఎదిరించటంలో దూకుడు, స్వంతంగా బతకాలని, పాలేరుగా ఎస్.వి.ఆర్.ను వేడుకోవటం, దానికి వారి స్పందన, ఎంతో సహజంగా రూపొందించారు.
ఇతర గీతాలు: లక్ష్మి, చంద్రమోహన్‌లపై ఎడ్లబండిపై చిత్రీకరించిన యుగళగీతం హుషారుగా సాగుతుంది. ‘అటు గంటల మోతలు గణగణ’ (ఘంటసాల, బి.వసంత-సి.నా.రె) సినారె వ్రాసిన మరో గీతం వీరిపై చిత్రీకరణ ‘తువ్వాయి, తువ్వాయి’ (ఘంటసాల, పి.సుశీల) సి.నా.రె. మరో గీతం ఇల్లువదిలి వెళుతున్న ఎస్.వి.రంగారావు, ధూళిపాళ, సావిత్రిలపై చిత్రీకరణ వారి స్వభావాలను తెలుపుతూ సాగుతుంది. ‘మంచితనానికి ఫలితం వంచన’ (ఘంటసాల) అన్నగారి మది వెనె్నల తునక తమ్ముని మనసే మీగడ తరగ, మరదలి మమత, మరువపు మొలక చక్కని ప్రయోగాలు. చిత్ర ప్రారంభంలో రైతులపై చిత్రీకరించిన గీతం ‘మా రైతు బాబాయా మా మంచి ఓడయా’(రచన- కొసరాజు, గానం- ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి బృందం).
రైతులపై చిత్రీకరించిన మరో గీతం ‘ఎనె్నలనక, ఎండనక కన్నుగీటే చిన్ని’ (ఎల్.ఆర్.ఈశ్వరి, ఎ.వి.ఎన్.మూర్తి బృందం) మోదుకూరి సత్యం, సారధి, అల్లు రామలింగయ్యలపై డాన్సర్స్‌పై చిత్రీకరించిన నృత్యగీతం ‘కనులే కలుపుదాం’(ఎల్.ఆర్.ఈశ్వరి బృందం).
‘బాంధవ్యాలు’ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడింది. నిర్మాతలకు మంచి పేరు సంపాదించి పెట్టింది. నటి లక్ష్మికి తొలి పరిచయ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రానికి 1968వ సం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డ్స్‌లో ఉత్తమ కుటుంబ కథాచిత్రంగా ‘ప్రథమ బహుమతి’, ‘బంగారు నంది’ అవార్డు పొందింది. పలువురి ప్రముఖుల ప్రశంసలు పొందింది.
(బాంధవ్యాలు’ చిత్రాన్ని మొదట 1967లో కమల్ బ్రదర్స్‌వారు, కె.ఎస్.గోపాలకృష్ణన్ కథ, దర్శకత్వంలో ‘కన్‌కండ దైవమ్’ పేరుతో (ఎస్.వి.రంగారావు ప్రధాన పాత్ర (అన్నగా)లో తమ్మునిగా ఎస్.వి.సుబ్బయ్య, మరదలుగా పద్మిని, ఒ.ఏ.కె.దేవర్ (విలన్‌గా) శివకుమార్ (చంద్రమోహన్) నటులతో తమిళంలో రూపొందించారు. సంగీతం: కె.వి.మహదేవన్ అందించారు.)
అన్నదమ్ముల, అనుబంధానికి, మరదలి వాత్సల్యానికి అద్దంపట్టేలా చక్కని చిత్రం బాంధవ్యాలును రూపొందించి, విజయవంతం చేసిన యూనిట్‌వారికి అభినందనలు తెలుపుదాం.

-సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి