ఫ్లాష్ బ్యాక్ @ 50

నినే్ పెళ్ళాడతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంగ్లండ్‌లోని ప్రముఖ నాటక రచయిత షేక్స్‌పియర్ 1590, 92 ప్రాంతంలో వ్రాసిన కామెడీ నాటకం ‘ది టేమింగ్ ఆఫ్ ది ష్రూ’’ (్The taming of the Shrew). ఆ దేశంలో విరివిగా ప్రదర్శింపబడి ప్రశంసలు పొందింది. ఈ నాటకం ఆధారంగా బి.విఠలాచార్య స్వీయ దర్శకత్వంలో తమ విఠల్ ప్రొడక్షన్స్ బేనర్‌పై 1957లో రూపొందించిన చిత్రం ‘‘వద్దంటే పెళ్ళి’’. చలం, కృష్ణకుమారి ప్రధాన పాత్రలు పోషించగా, సి.ఎస్.ఆర్, రమాదేవి, అమర్‌నాథ్, జూ. శ్రీరంజని, గిరిజ, రమణారెడ్డి, రాజనాల నటించారు.
అదే కథను కొంత మార్చి 1968లో విఠల్ ప్రొడక్షన్స్ బేనర్‌పై, ఎన్.టి.రామారావు, భారతి జంటగా ‘నినే్న పెళ్ళాడతా’ టైటిల్‌తో బి.వి.శ్రీనివాస్ దర్శకత్వంలో నిర్మించారు.
బి.వి.శ్రీనివాస్ దర్శకులు బి.విఠలాచార్య కుమారులు. తండ్రి విఠలాచార్య రూపొందించిన ‘వద్దంటే పెళ్ళి’ పంథాలోనే కొంత కథ మార్చి, హాస్యరస ప్రధానంగా రూపొందించారు.
ఈ చిత్రానికి మాటలు-జి.కె.మూర్తి, నృత్యం- చిన్ని- సంపత్, కళ- బి.నాగరాజు, స్టంట్స్-శివయ్య, సంగీతం-విజయా కృష్ణమూర్తి, ఛాయాగ్రహణం- హెచ్.ఎస్.వేణు, కూర్పు-కె.గోవిందస్వామి, పర్యవేక్షణ- జి.విశ్వనాథం, కథ, స్క్రీన్‌ప్లే, నిర్వహణ-బి.విఠలాచార్య, నిర్మాత- దర్శకుడు: బి.వి.శ్రీనివాస్.
ఉమాదేవి (్భరతి) మగవారిని ద్వేషించే, అందమైన, పొగరుబోతు యువతి. ఆమె తండ్రి జంగన్న(రావికొండలరావు), తల్లి జగదాంబ (సూర్యాకాంతం), వారి దూరపుబంధువు హనుమంతరావు (రమణారెడ్డి). కూతురికి పెళ్ళిచేయాలని తండ్రి కోరిక. కాని ఉమాదేవి మగవాడికి బానిస కావటం, నచ్చదని పెళ్ళికి ఇష్టపడదు. సంగీతం నేర్చుకుంటానని, మాస్టారిని కుదర్చమని, హనుమంతరావుకు బాధ్యత ఉమ, జగదాంబ అప్పగిస్తారు. ఉమాదేవికి గుణపాఠం నేర్పాలని హనుమంతరావు తన దూరపుబంధువు ఉమాపతి (ఎన్.టి.రామారావు)ని సంగీతం మేష్టారుగా ఇంటికి తీసుకువస్తాడు. ఉమ అతనివద్ద సంగీతం నేర్చుకోవటం మాని, మగవారికంటే ఆడవారే అధికులని, దాన్ని నిరూపించటానికి, అతణ్ణే పెళ్ళాడి, రుజువుచేస్తానంటుంది. తాను ఆజన్మ బ్రహ్మచారినని, పెళ్ళిని నిరాకరిస్తాడు ఉమాపతి. జగదాంబ కొడుకు గణపతి (కాకరాల), మంగమ్మ (్ఛయాదేవి), వడ్లమాని విశ్వనాథంల కుమార్తె నాంచారి (విజయలలిత)ని పెళ్ళిచూపులు చూసి, కట్నం విషయంలో తల్లిని మాయచేసి, నాంచారితో పెళ్ళికి సిద్ధపడతాడు. వారి పెళ్ళిలోనే ఉమాపతికి బలవంతంగా ఉమతో పెళ్ళి జరిపిస్తారు. పెళ్ళి తరువాత కూడా ఉమ ప్రవర్తన మారకపోవటం, కట్నం విషయంలో మోసపోయామని జగదాంబ, నాంచారిని కష్టాలుపెట్టడం జరుగుతుంది. అందుకోసం జగదాంబ, ఉమాదేవిలకు, బుద్ధిచెప్పాలని జంగన్న, అంజయ్య, ఉమాపతి కలిసి ప్లాన్‌వేసి మామగారు మరణించినట్టు, వారి ఆస్తిపోయినట్టు నాటకమాడి, ఉమాపతి ఇంటికి ఉమను, ఆమె తల్లిని తీసుకువస్తారు. ఉమలో మొండితనం తగ్గకపోగా, స్వతంత్రంగా బ్రతకాలని, ఓ శేఠ్‌వద్ద ఉద్యోగంలో చేరబోవటం, ఆ సేఠ్ వేషంలో ఉమాపతి, ఆమెను బలవంతం చేయబోయినట్టు, ఆమెను రక్షించటానికి గణపతి, వగైరాలు ప్రయత్నించటం, చివరకు ఉమాదేవి తండ్రి మరణించలేదని, ఉమాపతే ఈ నాటకం నడిపాడని తెలియటం. తన ప్రవర్తనకు ఉమ భర్తను మన్నింపుకోరటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో ఇంకా బాలకృష్ణ, గణేష్, పద్మాంజలి ఇతరులు నటించారు.
వద్దంటే పెళ్ళి (1957), నినే్నపెళ్ళాడతా (1968) ఈ రెండు చిత్రాలలో రమణారెడ్డి, బాలకృష్ణ నటించటం రమణారెడ్డి రెండు చిత్రాలలో ఒకే పాత్ర ఒకే పేరు కొద్దిమార్పుతో ఆంజనేయులు, హనుమంతరావుగా పోషించటం విశేషం.
దర్శకులు శ్రీనివాస్ సన్నివేశాలను కథకుతగ్గట్టు తమాషాగా, సహజంగా, హాస్యప్రియంగా తీర్చిదిద్దారు. విజయలలిత, భర్తతో ఆధునిక డ్రెస్‌తో ‘నిన్ను చూస్తేనే చాలు మనసు నిలవదు’(పి.సుశీల) నృత్య గీతం, చివర ఎన్.టి.ఆర్. మిత్ర బృందం, భారతిలతో పార్టీ గీతం ‘కాలం మారింది లోకం మారింది’(ఘంటసాల, పి.సుశీల, బసవేశ్వర్, రఘురాం బృందం) తో తప్ప, క్లబ్ డాన్స్‌లు, ఆధునిక పోకడలతో ఫైట్స్, ఛేజింగ్‌ల వంటి విశేష ప్రయాసలు, హీరో ఎన్.టి.ఆర్. ఇమేజికి తగ్గ యాక్షన్ సన్నివేశాలు లేకుండా వెరైటీగా, భార్యను అదుపుచేయటానికి భర్త బడితె పూజను తొలుత సందేహిస్తూ, ఆపైన విజృంభిస్తూ ఓ గీతంలో ‘పెళ్ళామా నా ముద్దుల పెళ్ళామా’(ఘంటసాల) అంటూ సాగటం. క్లయిమాక్స్‌లో శేఠ్ వేషంలో భార్యను స్కూటర్‌పై ఎక్కడెక్కడికో స్పీడ్‌గా తీసుకుపోవటం, దాన్ని కాకరాల, బాలకృష్ణ గణేష్‌లు వారి కార్లలో తమాషాగా ఛేజింగ్, చివర కొండ అంచునుంచి తిరిగి వెనక్కి తిప్పటం వంటి చిన్నచిన్న సన్నివేశాలతో చిత్రీకరించారు.
ఇక ఉమాపతిగా హీరో ఎన్.టి.రామారావుకు ఇదొక ప్రత్యేకమైన పాత్రగా నిలవటం, దాన్నివారు ఎంతో ఈజ్‌తో సరదాగా, అత్తగారితో తన ఇంటిలో ఆమె చేయవలసిన బాధ్యతలను కొంత గంభీరంగా, భార్య ఉమకు భర్త పట్ల ఆమె విధులు తెలియచేయటంలో సరసత, ఆమె మొండితనంతో పస్తులుండటం పట్ల ఆవేదన, ఎంతో ఈజ్‌తో, గంభీరత, ఆప్యాయత మొదలైన అంశాలను సన్నివేశానుగుణంగా నటనలో ప్రదర్శించారు.
ఇక భారతి మొండితనం, మూర్ఖత్వంగల యువతిగా మెప్పించింది. మిగిలినవారు పాత్రోచితమైన నటన చూపారు.
ఈ చిత్రంలోని గీతాలన్నీ సి.నారాయణరెడ్డిగారు వ్రాయగా, విజయకృష్ణమూర్తిగారు చక్కని బాణీలతో అలరించారు. జానపద చిత్రాల బాణీలు కూర్చటంలో సమర్ధులైన వీరి సారథ్యంలోని, మిగిలిన గీతాలు ఎన్.టి.ఆర్‌పై పిల్లలపై చిత్రీకరించిన గీతం ‘చిట్టిపొట్టి పిల్లల్లారా’ (ఘంటసాల) ‘తొలి రేయినాడు’ ఎన్.టి.ఆర్, భారతిలపై చిత్రీకరించిన గీతం ‘మల్లెల పానుపు వుంది చల్లని జాబిలి’ (పి.సుశీల) విజయలలిత, కాకరాల పెళ్ళిచూపులు సందర్భంగా వీణపై విజయలలిత పాడే గీతం ‘రాగాలన్నీ నీవే అనురాగాలన్నీ నీవే’. (పి.సుశీల)
‘నినే్ పెళ్ళాడతా’ చిత్రంలోని ‘మల్లెలపానుపు వుంది’, ‘ఓహో పెళ్ళామా’ ‘రాగాలన్నీ నీవే’ గీతాలు ఈనాటికీ శ్రోతలను అలరించటం, ఈ చిత్రాన్ని గుర్తుకుచేసుకునేలా చేయటం విశేషం.

- ఎస్.వి.రామారావు -సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి