జాతీయ వార్తలు

వీడని వరద భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భయపెడుతున్న అడయార్ నది
మరిన్ని ప్రాంతాలు జలమయం
పాలు, నీరూ.. వందపైనే
సత్రాలుగా మారిన
రైల్వే స్టేషన్లు, బస్‌స్టాండ్‌లు

వందేళ్లలో ఎన్నడూలేని వర్ష, వరద బీభత్సంలో చెన్నై కొట్టుమిట్టాడుతూనే ఉంది. కుండపోత తీవ్రత తగ్గినా ఉప్పొంగుతున్న వాగులు, వంకలు, నదులు నగరాన్ని ముంచెత్తుతున్నాయి. కొత్త ప్రాంతాలను జలమయం చేస్తున్నాయి. అడయార్ నది ఉగ్రరూపంతో పరిస్థితి మరింత భయానకంగా మారింది. వందలు, వేల సంఖ్యలో నీటి మధ్య చిక్కుకు పోయిన వారిని ఆదుకునే చర్యలు ముమ్మరమయ్యాయి. వందలాది ప్రాంతాల్లో జనం బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి జయలలిత హెలికాప్టర్‌లో నగరాన్ని పరిశీలించారు. సహాయ, సంక్షేమ చర్యల్లో జాప్యం వద్దని ఆదేశించారు. తమిళనాడు వర్షాలు, వరద పరిస్థితిపై లోక్‌సభలో రెండు గంటలు చర్చ జరిగింది. పరిస్థితి భయానకమని సాక్షాత్తు హోం మంత్రి రాజ్‌నాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. (చిత్రం) చెరువా.. చెన్నపట్నమా..
(ఇన్‌సెట్‌లో) చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల పడిగాపులు