జాతీయ వార్తలు

వరదలకు ఉత్తరాదిలో 60 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాల్లో జన జీవనం అతలాకుతలమవుతోంది. నదులు, వాగులు పొంగి ప్రవహిస్తుండడంతో వరద తాకిడి సుమారు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్, ఉత్తరాఖండ్, యుపి, బిహార్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనం అవస్థల పాలయ్యారు. అస్సాం, పశ్చిమబెంగాల్, అరుణాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. కొన్ని చోట్ల రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ముంపునకు గురైన ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఉత్తరాఖండ్‌లో భారీవర్షాల కారణంగా అమర్‌నాథ్, కేదారినాథ్, బద్రీనాథ్, గంగోత్రి యాత్రలకు వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు.