క్రీడాభూమి

మళ్లీ రోహిత్ శర్మ ఫ్లాప్ షో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: పొట్టి ఫార్మెట్స్‌కే తప్ప టెస్టు క్రికెట్‌కు పనికిరాడని ముద్ర వేయించుకున్న రోహిత్ శర్మ తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌ల్లో అతనికి స్థానం దక్కలేదు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 2 పరుగులు చేసిన అతను సిమోన్ హార్మర్ బౌలింగ్‌లో డివిలియర్స్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసి, మోర్న్ మోర్కెల్ బౌలింగ్‌లో ఎల్గార్‌కు చిక్కాడు. ప్రస్తుత టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అతను కేవలం ఒక పరుగు చేసి డేన్ పిడిట్ బంతిని అర్థం చేసుకోలేక, ఇమ్రాన్ తాహిర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతను విజృంభించి భారీ స్కోరు చేస్తాడని అశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. బ్యాటింగ్‌లో ప్రమోషన్‌తోనైనా అతని దశ తిరుగుతుందన్న అభిప్రాయంతో రోహిత్‌ను కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దించాడు. కానీ, క్రీజ్‌లోకి వచ్చి గార్డ్ తీసుకున్నంత సేపు కూడా రోహిత్ నిలవలేకపోయాడు. మోర్కెల్ వేసిన బంతి మెరుపువేగంతో దూసుకెళ్లి స్టంప్స్‌ను పెకళించింది. దారుణమైన ఫుట్‌వర్క్‌తో ఫ్లాప్ షోను కొనసాగిస్తున్న రోహిత్‌కు బహుశా ఇదే చివరి టెస్టు కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఆజింక్య రహానే వంటి ఎంతో మంది యువ ఆటగాళ్లు తీవ్రంగా పోటీపడుతున్న తరుణంలో సెలక్టర్లు రోహిత్‌కు ఇంకాఇంకా అవకాశాలు ఇవ్వరన్నది విశే్లషకుల వాదన.
రంజీల్లో ఆడాలి..
టెస్టు ఫార్మెట్‌లో రాణించాలంటే తప్పనిసరిగా రంజీ ట్రోఫీల్లో ఆడాలని రోహిత్ శర్మకు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సూచించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో చివరి రెండు టెస్టుల్లో అవకాశం దక్కిన రోహిత్ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడని అన్నాడు. టెస్టుల్లో రాణించడం సులభం కాదన్నాడు. రంజీ ట్రోఫీలో ఆడితే రోహిత్ బ్యాటింగ్ గాడిలో పడుతుందన్నాడు. (చిత్రం) మోర్న్ మోర్కెల్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్