సబ్ ఫీచర్

అలంకరణతో ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్న చిన్న కుండీల్లో అందమైన మొక్కలను పెంచడం హాబీగా మారితే- ఆ ఇల్లు నయనమనోహరంగానే కాదు, అక్కడి పరిసరాలూ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. పట్టణాలు, నగరాలు ‘కాంక్రీటు జంగిళ్లు’గా మారుతున్న నేటి కాలంలో ఇంట్లోకి ధారాళంగా గాలి, వెలుతురు వచ్చే పరిస్థితులే కనిపించడం లేదు. గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గడం, హానికారక వాయువుల వల్ల రోగాల బారిన పడడం నేడు సర్వసాధారణమైంది. ఇలాంటి తరుణంలో గాలిని శుద్ధి చేసే మొక్కల్ని పెంచేందుకు జనంలో ఆసక్తి పెరిగింది. నిత్యం కాలుష్యం నడుమ కాలక్షేపం చేసే పట్టణవాసులు తమ ఇళ్లలో పచ్చని మొక్కలతో ఆహ్లాదం పొందేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇంటి ముందు ఖాళీ స్థలం లేకపోయినా- వరండాల్లో, డాబాలపైన చక్కని సువాసనతో పాటు గృహసీమకు కొత్తశోభనిచ్చే మొక్కలకు గిరాకీ పెరిగింది.
సువాసన అంటే చాలామందికి మరువం, దవనం మొక్కలే గుర్తుకొస్తాయి. ఇప్పటికీ సంప్రదాయ బద్ధంగా చాలామంది తమ ఇళ్లలో మరువం, దవనం మొక్కల్ని కుండీల్లో పెంచుతుంటారు. కమ్మటి గుబాళింపులే కాదు, గాలిని శుద్ధి చేసే మొక్కల్ని కుండీల్లో పెంచితే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. గాలిని శుద్ధి చేసే మొక్కలను ఆస్పత్రుల్లో పెంచడం వల్ల రోగులు మానసిక ఒత్తిడికి దూరంగా ఉంటున్నట్లు డచ్ పరిశోధకులు గతంలో జరిపిన ఓ అధ్యయనంలో కనుగొన్నారు. విషపూరిత పదార్థాలను శుద్ధి చేసే మొక్కలను పెంచడం ఆరోగ్యరీత్యా ఎంతో మంచిదని అమెరికాలోని జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (నాసా) కూడా ఇదివరకే ఓ జాబితాను సూచించింది. ఆ జాబితాలో పేర్కొన్న మొక్కలు అధిక మొత్తంలో ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. ఫలితంగా మనం స్వచ్ఛమైన గాలిని పీల్చేందుకు అవకాశం కలుగుతుంది. ఈ మొక్కలను కుండీల్లో పొందికగా పెంచుకోవచ్చు. వీటికి రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులను వాడనక్కర్లేదు. మట్టిలో ఎదిగే మొక్కలకు పోషకాలు లభించేలా ఆర్గానిక్ ఎరువులు (కంపోస్టు) వాడొచ్చు. రాలిన పూలు, ఆకులను, ఎండిపోయిన పుల్లలను ఎప్పటికప్పుడు తీసివేస్తూ, కుండీల్లో నీరు నిల్వ ఉండకుండా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ‘ఇండోర్ ప్లాంట్లు’గా పెంచుకునే వీటిని నీడ ఉన్న చోట పెంచుకోవాలి.
గాలిని శుద్ధి చేస్తూ ఇంటికి వనె్న తెచ్చే మొక్కల్లో పలు రకాలున్నాయి. సువాసనలు వెదజల్లే పూల మొక్కలు, విభిన్నమైన కాంతులీనే క్రోటన్ మొక్కలు నేడు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి. అందరికీ తెలిసిన కలబంద (అలెవొర) మొక్క గాలిలో ఉండే బెంజీన్ వంటి విషపదార్థాలను శుద్ధి చేసి, ఆక్సిజన్‌ను బాగా విడుదల చేస్తుంది. శే్వత వర్ణ సుమాలతో కనువిందు చేసే ‘పీస్ లిల్లీ’ మొక్క ట్రైక్లోరో ఇథిలీన్, అమ్మోనియా వంటి హానికారక పదార్థాలను తొలగిస్తుంది. క్రిస్మస్ కాక్టస్, ఇంగ్లీష్ ఐవీ, రబ్బర్ ట్రీ, స్నేక్ ప్లాంట్, బాంబూ పామ్, ఫిలోడెండ్రాన్, డ్రాసియానా, స్పైడర్ ప్లాంట్, గోల్డెన్ పొథాస్, ఆంధూరియం, బోస్టన్ ఫెర్న్,చైనీస్ ఎవర్ గ్రీన్ వంటి మొక్కల్ని పెంచితే ఇంటి ఆవరణలో స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. రంగురంగుల ఆకులు, పూలతో కనువిందు చేసే ఈ తరహా మొక్కలు వాతావరణంలో తేమను పెంచుతూ మంచి గాలిని మనకు అందిస్తాయి.

-రమణి