ఫోకస్

ప్రజల కోసం పనిచేస్తేనే గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చట్టసభల సభ్యులు ప్రజల కోసం పనిచేస్తేనే వారికి గౌరవం ఉంటుంది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు కానీ రాష్ట్ర శాసనసభ సమావేశాలు కానీ ప్రజాస్వామ్య విలువలను మంటగలిపే విధంగా ఉంటున్నాయి. మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాం. ప్రజల సమస్యలపై విస్తృతంగా చర్చ జరిగితే మంచీ, చెడు ఏమిటో వెల్లడవుతుంది. వివిధ పక్షాల సభ్యుల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం అవసరమైన చట్టాలను రూపొందించడం, పరిపాలనాపరమైన విధాన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుంటుంది. మనది విశాలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ. పార్లమెంట్ సభ్యులపై గురుతరమైన బాధ్యత ఉంటుంది. ఒక్కోక్క పార్లమెంట్ సభ్యుడు దాదాపు సగభాగం రెవెన్యూ జిల్లాకు ప్రాధాన్యత వహిస్తుంటారు. అంటే నాలుగు నుండి ఏడు-ఎనిమిది శాసనసభా నియోజకవర్గాలు ఒక లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. పార్లమెంట్ సభ్యుడి పరిధిలో ప్రజలు అనేక సమస్యలు, ఇక్కట్లు ఎదుర్కొంటూ ఉంటారు. వీటి పరిష్కారానికి పార్లమెంట్ సమావేశాలు ప్రధానమై వేదికగా ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు. అయితే ఇప్పుడు జరుగుతున్నదేమిటి? అని ప్రశ్నించుకుంటే గౌరవసభ్యులు తమ నియోజకవర్గ సమస్యలు కానీ, దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై కానీ దృష్టి కేంద్రీకరించడం లేదు. తమ ప్రసంగాల్లో సమస్యలను ప్రస్తావించలేకపోతున్నారు. వ్యక్తిగత దూషణలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలను రణరంగంగా మార్చివేస్తున్నారు. పార్లమెంట్ సభ్యులకు పరిపాలనా వ్యవహారాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో నిర్ధిష్టమైన శిక్షణా కార్యక్రమాలు ఉండాలి. అలాగే పార్లమెంట్‌లో ఎలా మెలగాలో, ఎలా ప్రవర్తించకూడదో తెలియచేసే విధంగా క్రమశిక్షణపై కూడా ట్రైనింగ్ ఇవ్వాలి.

- డాక్టర్ పాండురంగారావు అధ్యక్షుడు, లోక్‌సత్తా, తెలంగాణ రాష్ట్రం.