ఫోకస్

అర్హులకే రిజర్వేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన సమాజంలో విద్య, ఉద్యోగ, రాజ్యాధికారంలో రిజర్వేషన్లు అవసరమే! అయితే ఈ రిజర్వేషన్లు అర్హులకు మాత్రమే అందించాలి. సామాజికంగా, కులపరంగా విచక్షణకు గురైన వారికి, తరతరాలుగా అణచివేతకు గురైనవారికి మాత్రమే ఇవి అందాలి. దేశ సంపద సమాజంలో అందరికీ అందాలన్నదే రాజ్యాంగ రూపకల్పన చేసిన వారి ఉద్దేశం. ఇందుకు అనుగుణంగా రాజ్యాంగంలో ఆదేశిక సూత్రలను రూపొందించారు. దళితులు, గిరిజనులు, తదితరులకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఉద్యోగాల్లో, పరిపాలనలో వీరు భాగస్వాములు అవుతున్నారు. అట్టడుగు వర్గాల వారికి కల్పిస్తున్న రిజర్వేషన్ల సౌకర్యం ఉన్నత వర్గాల వారు కోరుకోకూడదు.
రిజర్వేషన్లు కావాలంటూ ప్రజాస్వామ్యంలో ఎవరైనా డిమాండ్ చేయవచ్చు. అయితే నిజంగా తాము రిజర్వేషన్లకు అర్హులమేనా అని ఆందోళన చేసే ముందే గుండెపై చేయివేసుకుని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇటీవల గుజరాత్‌లో పటేళ్లు, ఆంధ్రప్రదేశ్‌లో కాపులు రిజర్వేషన్లకోసం ఆందోళన చేపట్టారు. ఈ కులాల వారికి రిజర్వేషన్లు అవసరమా అని ప్రశ్నించుకుంటే.. అవసరం లేదని చెప్పుకోవాల్సి ఉంటుంది. వాస్తవం ఆలోచిస్తే.. రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న వారికి, తమ డిమాండ్లు, తమ కులాల సామాజిక పరిస్థితిపై సరైన స్పష్టత లేదనిపిస్తోంది.
రిజర్వేషన్లు కావాలని అడిగే కన్నా ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయాలంటూ ఆందోళన చేస్తే బాగుండేది. ఈ కోణంలో పోరాటం జరగకపోవడం వల్ల పాలకులు అంతర్గతంగా సంతోషంగానే ఉన్నారు. 1.20 కోట్ల మంది ఉద్యోగులు గతంలో పనిచేస్తుండగా, గత 20 సంవత్సరాల్లో 40 లక్షల నుండి 50 లక్షల ఉద్యోగాలు ఖాళీ అయ్యాయి. ఈ ఖాళీలను భర్తీ చేయలేదు. ఇవి భర్తీ అయితే దాదాపు 25 లక్షల మంది దళితులు, గిరిజనులు, బడుగు బలహీనవర్గాలవారు లబ్దిపొందుతారు అనడంలో సందేహం లేదు. ప్రభుత్వ నిర్లిప్తత వల్ల బడుగు, బలహీన వర్గాల వారు తీవ్రంగా నష్టపోతున్నారు. బడుగు, బలహీన వర్గాల వారు రిజర్వేషన్లవల్ల లబ్దిపొందారు. వారి పిల్లలు చదువుకుని ఉద్యోగాల కోసం వేచి చూస్తుంటే, వారికి అవకాశం లభించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగం ఉంటే సమాజంలో భద్రత పెరుగుతుంది, డిగ్నిటీ పెరుగుతుంది. ఈ అవకాశాన్ని పేదలు కోల్పోతున్నారు. ప్రపంచ బ్యాంకు వత్తిడి మేరకే ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయడం లేదు. సమాజంలో కొంతమంది రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారు. రిజర్వేషన్లపై ఆందోళన ఈనాటిది కాదు. తరతరాలుగా కొనసాగుతూనే ఉంది. సమాజంలో అందరూ ఈ అంశంపై ఆలోచించాలి. రిజర్వేషన్లు అర్హులైన అందరికీ అందేలా చేయూత ఇవ్వాలి.

- ప్రొఫెసర్ హరగోపాల్ సామాజిక శాస్తవ్రేత్త