ఫోకస్

ఆధిపత్యంకోసం ఆరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వవిద్యాలయాల్లో ఆధిపత్యం కోసమే కొందరు బీఫ్‌ను వ్యతిరేకిస్తున్నారు. తినే తిండిపై ఆంక్షలు విధిస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. విద్యార్థుల్లో వివక్ష చూపేందుకే బీఫ్ ఫెస్టివల్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఓయూలో 14 దేవాలయాలు ఉన్నాయి. రెండు మసీదులున్నాయి. ఒక్క చర్చి కూడా లేదు. వీరు కేవలం వారి వారి స్వార్థ రాజకీయాల కోసమే ఓయూను ఓ వేదికగా వాడుకుంటున్నారు. కానీ ఓయూలో అసలు బీఫ్‌ను వ్యతిరేకించే వారు ఎవరూ లేరు. బీఫ్ ఫెస్టివల్‌కు అనుమతి పేరిట విద్యార్థి సంఘాలను, ప్రజా సాంస్కృతిక వ్యవస్థను భ్రష్ఠు పట్టిస్తున్నారు. ఓయూ భూముల ఆక్రమణలపై నోరు విప్పని ఓయూ అధికారులు కేవలం బీఫ్ ఫెస్టివల్‌పైనే ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారో అర్థం కావడంలేదు. ఓయూలో కేవలం 7శాతం విద్యార్థులు మాత్రమే ఉన్న అగ్రవర్ణాలవారు కుల వివక్షతో, మతం ముసుగులో బీఫ్‌ను వ్యతిరేకించడం సమంజసం కాదు. వ్యవసాయం, పాడిపరిశ్రమతో ముడిపడివున్న గోవులను హరించవద్దని చట్టం ఉండవచ్చు. కాదనలేం.. కానీ ఆ గోవుల పరిరక్షణ లేక పశుగ్రాసం లేక బక్కచిక్కిన పశువులను వైద్యుల పరీక్షల అనంతరమే వాటి వ్యధ జరుగుతుందనే విషయం గ్రహించాలి. గొడ్డు మాంసాన్ని ముస్లిం, మైనార్టీ, దళితులు మాత్రమే తినరు. హిందువుల్లో కూడా మెజార్టీ ప్రజలు తింటారు. కొన్ని రాష్ట్రాల్లో గోవధను నిషేధించారు. వారి స్వార్థ కోసం దేశాన్ని కాషాయమయం చేసే దిశగా పాలకులు సమాజాన్ని విభజిస్తున్నారు. గత సంవత్సరం ఓయూలో మేము బీఫ్ ఫెస్టివల్ నిర్వహించాం. ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. కానీ గోమాసం తింటున్నారని దాద్రీలో ఒకరిని హత్య చేయడం, కాశ్మీర్‌లో ఓ ఎమ్మెల్యే గోమాంసంతో విందు ఏర్పాటు చేశాడని అతడిపై దాడికి పూనుకోవడం హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో తినే తిండిపే ఆంక్షలు విధించడం సబబు కాదు. జాతీయ పోషకాహార సంస్థ కూడా గోమాంసాన్ని తినవచ్చని పేర్కొంది. చికెన్‌లో 8.3శాతం ప్రొటీన్లుంటే, 12శాతం గొర్రె మాంసంలో ఉన్నాయని, అదే గోమాంసంలో 28.3శాతం ప్రొటీన్లున్నాయ. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఏదీ ఏమైనా స్వార్థరాజకీయాల కోసం ప్రజాహక్కులను, ప్రజల ఆహారంపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదు.

-బి. స్టాలిన్ ప్రజాస్వామిక సాంస్కృతిక ఫోరం కన్వీనర్