ఫోకస్

నియంతృత్వ పోకడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్శిటీల ఛాన్సలర్, వైస్-్ఛన్సలర్లను ప్రభుత్వమే నియమించాలనుకోవడం నియంతృత్వమే అవుతుంది. ప్రజాస్వామ్యంలో అది సరైన పద్ధతి కాదు. వైస్-్ఛన్సలర్లుగా ప్రభుత్వం సూచించే, సిఫార్సు చేసే వ్యక్తులనే గవర్నర్ నియమిస్తున్నారు. ఇప్పటివరకు అమలులో ఉన్న ఈ విధానం సక్రమంగా లేదు కాబట్టి మారుస్తాం అని రాష్ట్ర ప్రభుత్వం అంటున్నది. చాన్సలర్, వైస్-్ఛన్సలర్ల నియమాకాలను రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తే ప్రశ్నించడానికి అవకాశమే ఉండదు. ప్రభుత్వం ఏది అనుకుంటే అదే జరుగుతుంది. వైస్-్ఛన్సలర్లను రిటైర్డ్ జడ్జిలను రిటైర్డ్ ఐపిఎస్, ఐఏఎస్‌లను నియమిస్తే అభ్యంతరం లేదు. కానీ ఛాన్సలర్‌గా గవర్నర్ ఉంటేనే బాగుంటుంది. ప్రభుత్వం ఏదైనా అంశంపై చాలా తీవ్రస్థాయిలో వెళ్ళినప్పుడు ‘చెక్’ పెట్టేందుకు రాష్టప్రతి ద్వారా నియమితులైన గవర్నర్ ఛాన్సలర్‌గా ఉండాలి.ఇక కొన్సి వర్సిటీలకు గత రెండేళ్ళుగా వైస్-్ఛన్సలర్లు లేరు. దీంతో యుజిసి గ్రాంట్స్ ఆగిపోతాయి. నివేదికలు పంపించాల్సింది వైస్-్ఛన్సలర్లే. ముఖ్యంగా వర్సిటీల్లో కలుషితమైన రాజకీయాలు పోవాలంటే ప్రభుత్వ జోక్యం తగ్గించాలి.

- వంశీచంద్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ