ఫోకస్

సవాళ్లు అనవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకరి ఆహారపు అలవాట్లను మరొకరు నియంత్రించొద్దు. ఎవరి ఆహారం వారి ఇష్టం. దానిపై మరొకరు పెత్తనం చేయడం భావ్యం కాదు. బీఫ్ తినడం అనేది కొత్తేమీ కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి అనేక వర్గాలు తమ ఆహారపు అలవాట్లలో భాగంగా బీఫ్ తింటున్నారు. ఇష్టం లేనివాళ్లు మానేయ వచ్చు గానీ ఇంకొకరు తింటుంటే దాడులు చేస్తాం, దౌర్జన్యం చేస్తాం, అంతు చూస్తామంటూ రెచ్చగొట్టే విధానం మంచిది కాదు. మాంసాహారాల్లో రకరకాలు తినేవారు ఎంతోమంది ఉన్నారు. అయతే బీఫ్ తినేవాళ్లు తినవచ్చు దానికి ఒక ఉస్మానియా విశ్వవిద్యాలయమో, మరొకటో వేదిక చేసుకుని ఏదో ఫెస్టివల్ మాదిరిగా చేసుకోవడం, దాన్ని పెద్దగా ప్రచారం చేసుకోవడం మంచిదికాదు. ఈ ఫెస్టివల్ పేరుతో రెచ్చగొట్టుకోవడం, అడ్డుకుంటే దాడులు చేస్తామంటూ చెప్పడం సరికాదు. ఎవరి ఆహారపు అలవాట్లు ప్రకారం వాళ్లు తినండి, ఆ స్వేచ్ఛ వారికి ఉంటుంది. అడ్డుకునే అధికారం ఎవరికీ లేదు. కానీ ఫెస్టివల్స్ పేరుతో ఇలా సవాళ్లు విసురుకుంటూ నిర్వహించడం అనవసరం. ప్రభుత్వం కూడా అనుమతించమని చెప్పడం సరికాదు. అలా చేస్తే మరొకరి ఆహారపు అలవాట్లను అధికారికంగా అడ్డుకోవడమే అవుతుంది. నియంత్రణ, నిషేధం అనేవి సరికాదు. అసలు నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే మతోన్మాద శక్తులు పేట్రేగి పోతున్నాయి. అసహన రాజకీయాలు, దాడులు పెరిగిపోయాయి. బీఫ్ తింటే దాడి చేస్తామనడం బిజెపి దాని అనుబంధ మత సంస్థలకు అలవాటుగా మారింది. అధికారంలోకి వచ్చాక మతోన్మాద పోకడలతో మరింత రెచ్చిపోతున్నాయి. ఉస్మానియాలో జరిగే బీఫ్ ఫెస్టివల్‌ను అడ్డుకుంటామంటూ రెచ్చగొట్టే ప్రకటనలు కొన్ని సంస్థలు చేస్తున్నాయి. సున్నితమైన విషయాల్లో జాగ్రత్త వహించకుండా మరో వర్గాన్ని టార్గెట్ చేసేలా మాట్లాడ్డం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. భారత దేశంలో కింది కులాలు, మైనార్టీలు బీఫ్ తినడం అనేది వాళ్ల వాళ్ల ఆహారపు అలవాట్లలో ఒక భాగంగా మాత్రమే చూడాలి. అంతేగాని వద్దనడానికి మీరెవరు? కాబట్టి ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు బీఫ్ తినేవాళ్లను అడ్డుకోవద్దు. అలాగే బీఫ్ తినేవాళ్లు మీ ఇష్టం వచ్చినట్లు తినండి, కానీ ఇలా ఫెస్టివల్స్ పేరుతో సవాళ్లు విసురుకోవడం అనవసరం. అందరూ సంయమనం పాటించాలి. సమాజంలో శాంతి అందరికీ ముఖ్యం.

- కె.రామకృష్ణ, సిపిఐ, ఎపి రాష్ట్ర కార్యదర్శి