ఫోకస్

ఇతర మతస్థుల మనోభావాలు దెబ్బతీయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లాం మతం ప్రకారం అల్లాను ఆరాధిస్తాం. దేవుడంటే అల్లా ఒక్కరే, పుట్టించేవాడు, గిట్టించేవాడు ఆయనే. సృష్టిలోని జంతువులన్నీ పరాన్న జీవులే. మానవులు కొన్ని జంతువులను సంహరించి భుజించడానికి అవకాశం ఉంది. అయితే వేరే మతానికి చెందిన వారిని అల్లరి పెట్టాలనో, వారి మనోభావాలను దెబ్బతీయాలన్న దురాలోచన ఎవరూ చేయకూడదు. ఈ నెల 10న బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన కొంతమంది విద్యార్థులు నిర్ణయించడం సమంజసం కాదు. వారికి ఇష్టమైనది తినడంలో తప్పు లేదు. కానీ యూనివర్సిటీ ఆవరణలో ఒక పండుగ చేసుకోవాల్సిన అవసరం అసలే లేదు. దానివల్ల ఇతరుల మనోభావాలు దెబ్బతింటాయి. ఇతరుల సెంటిమెంట్లను కాలరాసే అధికారం ఎవరికీ లేదు. వారు బీఫ్ తినాలనుకుంటే గదుల్లో కూర్చొని తింటే సమస్యే లేదు. బహిరంగంగా తినాల్సిన అవసరం ఏమిటీ? విద్యాభ్యాసం చేయాల్సిన ప్రాంగణంలో ఇలాంటివి చేసి అనవసరమైన రాద్ధాంతాలకు తెర లేపవద్దు. దేశ రక్షణకు సమష్టిగా నిలవాల్సిన విద్యార్థులు ఒక ఫెస్టివల్ పేరిట వర్సిటీ వాతావరణాన్ని కలుషితం చేయరాదు. మంచి పేరు తెచ్చుకోవడానికి సంవత్సరాలు కష్టపడాల్సి వస్తుంది. చెడు పేరు తెచ్చుకోవడానికి ఒక్క సెకను చాలు. మంచి భవిష్యత్తు ఉన్న విద్యార్థులు బీఫ్ ఫెస్టివల్ పేరిట చెడ్డ పేరు తెచ్చుకోవడం భావ్యం కాదు. ఇది ఇంతటితో ఆగదు. కాబట్టి యూనివర్సిటీ ఉన్నతాధికారులూ దీనిని అంగీకరించరాదు, అనుమతించరాదు. భవిష్యత్తులో మరికొన్ని విద్యార్థి సంఘాలు ఇంకా ఏదైనా ఉత్సవం జరుపుతామంటే, అప్పుడూ అనుమతించాల్సి వస్తుంది. దీంతో చదువుకు గండి పడి, ఫెస్టివల్స్ వైపు దృష్టి మరలుతుంది.
యూనివర్సిటీ ఆవరణలో ఎటువంటి ఫెస్టివల్స్‌కు అనుమతించకుండా ఇప్పుడున్న యధాతథస్థితి కొనసాగించాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశించడం హర్షణీయం. కోర్టు తీర్పును తు.చ తప్పకుండా అమలుచేస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలి. విద్యార్థులు ఇటువంటివి చేపడితే రాజకీయ పార్టీలు జోక్యం చేసుకుని, రాజకీయ లబ్దికోసం వైషమ్యాలు పెంచే ప్రమాదం ఉంది. దీనిని విద్యార్థి సంఘాలు, విద్యార్థులు అర్థం చేసుకోవాలి. బీఫ్ ఫెస్టివల్ పేరిట ఇతర మతాలను బాధించడం భావ్యం కాదు. కాబట్టి యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు, విద్యార్థులు బీఫ్ ఫెస్టివల్ నిర్వహించాలన్న పట్టుదల వీడి, అందరూ పరస్పరం సహకరించుకుంటూ విద్యాభ్యాసం చేసి ఉన్నత స్థానానికి ఎదిగి సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరుతున్నాను.

- సయ్యద్ అతాహుస్సేన్ అంజుమ్ సభ్యుడు, షాషీన్‌నగర్ నమాజ్ కమిటీ