ఫోకస్

జాతీయ విధానం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జల వివాదాల పరిష్కారానికి జాతీయ స్థాయిలో ఒక శాశ్వత విధానాన్ని కేంద్రం ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎగువన ఉన్న తెలంగాణ కృష్ణా నదిపై నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి పథకం వల్ల దాదాపు 135 టిఎంసి నీటిని శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి తోడుతారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టు సర్వనాశనమవుతుంది. శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా జలాలు రాయలసీమకు అందుతాయి. కాని 800 అడుగులకే ఉన్న నీటిని తెలంగాణ తోడితే, శ్రీశైలం ప్రాజెక్టు ఇక ఎప్పటికీ నిండదు. ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్ర జలసంఘం అనుమతులు లేవు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సాగునీటి ప్రయోజనాల కోసం తన గళాన్ని గట్టిగా వినిపించాలి. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో గట్టిగా మాట్లాడడంలేదు. కేంద్రానికి నిరసన వ్యక్తం చేయడంలేదు. మొక్కుబడి ప్రకటనలకే పరిమితమయ్యారు. వైకాపా అధినేత జగన్ కర్నూలులో మూడు రోజుల జలదీక్షవల్ల ప్రజలకు, దేశానికి ఆంధ్రరాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం విషయం తెలిసింది. రాజోలిబండ మళ్లింపు పథకం ఎత్తుపెంచడం వల్ల కెసి కెనాల్‌కు ఆశించినట్లుగా సాగునీరు రావు. అందుకే వెనకబడిన రాయలసీమ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల స్కీంవల్ల ఖమ్మం, నల్లగొండ రైతులకు కూడా అన్యాయం జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు జలాల పంపకాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఎగువ రాష్ట్రం దుందుడుకు తనంతో ప్రాజెక్టులు నిర్మిస్తే కింది రాష్ట్రాల రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయి. కావేరి జల సమస్య తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టింది. కేంద్రం వద్ద పటిష్టమైన జల విధానం లేదు. జాతీయ స్థాయిలో రాష్ట్రాల మధ్య జలాల వివాదం తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థ ఉండాలి. విభజన చట్టంలో పేర్కొన్న కృష్ణా బోర్డుకు పెద్దగా అధికారాలు లేవు ఇంతవరకు ఈ బోర్డుకు సరైన ఆఫీసు, సిబ్బంది లేరు. గోదావరి బోర్డు పరిస్థితి కూడా ఇంతే. తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మించే ప్రాజెక్టులవల్ల ధవళేశ్వరం బ్యారేజీకి ఆశించినట్లుగా నీరురాదు. దీనివల్ల 10 లక్షల ఎకరాల సాగు భూమి బీడవుతుంది. కేంద్రం జోక్యం చేసుకుని అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిలుపుదల చేయాలి. సాగునీటి నిపుణులతో చట్టబద్ధత ఉన్న కమిటీని నియమించాలి.

- విశే్వశ్వరరెడ్డి వైకాపా శాసనసభాపక్ష ఉపనేత