ఫోకస్

గవర్నర్లు లేకపోతే ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు మధ్య సంబంధాలు సజావుగా నడిపేందుకు, రాజ్యాంగపరమైన విధులను రాష్ట్రంలో నిర్వహించేందుకు గవర్నర్ కీలకమైన పాత్ర వహిస్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో గవర్నర్ పాత్రను విస్మరించేందుకు వీలులేదు. గవర్నర్ల వ్యవస్థ బ్రిటిష్ కాలంనుంచి మనకు సంక్రమించి ఉండవచ్చు. అంతమాత్రాన గవర్నర్ల వ్యవస్థవల్ల ఉపయోగం లేదనుకోవడానికి వీలులేదు. పంజాబ్, జమ్ముకాశ్మీర్, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాలు, విదేశాలతో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో తరచుగా ఘర్షణలు, అల్లకల్లోలాలు జరుగుతుంటాయి. ఆ వివరాలను కేంద్రానికి సకాలంలో ఎప్పటికప్పుడు అందించాలంటే గవర్నర్ ఉండాలి. సాధారణమైన రోజుల్లో గవర్నర్ తెరపైకి రారు. శాసనసభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానిస్తారు. రాజ్యాంగబద్ధంగా వారిచేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతిభధ్రతల వివరాలను కేంద్రానికి తెలియచేస్తారు. ఒకవేళ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థ కుప్పకూలితే గవర్నర్ పాలనను కేంద్రం విధిస్తుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో గవర్నర్ పాలనను కేంద్రం విధించిన విషయం విదితమే. రాష్ట్రాల్లో రాజ్యాంగ సంక్షోభం తలెత్తినప్పుడు గవర్నర్ తెరపైకి వచ్చి రాజ్యాంగ విధులు నిర్వహిస్తారు. కాని ఇటీవల కాలంలో గవర్నర్ పాత్రపై విమర్శలు వస్తున్నాయి. దీనికి కారణం కొంత మంది గవర్నర్లు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడమే. అనేకమంది గవర్నర్లు తమను నియమించిన రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల గవర్నర్ల వ్యవస్థ అపహాస్యానికి గురవుతోంది. కొన్ని రాష్ట్రాల్లో రాజ్‌భవన్‌లో అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వాలకు వ్యతిరేక వర్గానికి కేంద్రంగా మారుతున్నాయి. గవర్నర్లుగా జవాబుదారీతనంతో వ్యవహరించేవారిని నియమించాలి. గవర్నర్లు న్యాయంగా, నిష్పక్షపాతంగా ఉండాలి. రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాలి.

- ప్రొఫెసర్ రాజ్ సిద్ధార్థ్ కాకతీయ మెడికల్ కాలేజీ