ఫోకస్

జాతీయ స్థాయిలో చర్చ జరగాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివిధ సందర్భాల్లో గవర్నర్ల పాత్ర చాలా వివాదస్పదమవుతోంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో గవర్నర్ల పాత్ర ఎలా ఉండాలి.. వారికి ఉండే విధులు, అధికారాలపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. కొన్ని సందర్భాల్లో గవర్నర్లు తమ పరిధిని దాటి రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకోవడం, ప్రభుత్వాలు పడిపోవడానికీ కారణమవుతున్నారు. ఇది దురదృష్టకరం. గవర్నర్ల ప్రమేయంతో ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతున్నది. కొద్దిగా లోతుగా అధ్యయనం చేస్తే, గవర్నర్ల వ్యవస్థ బ్రిటిష్ హయాం నుంచి వచ్చింది. ఫెడరల్ దేశంలో గవర్నర్లకు కొన్ని అధికారాలు అప్పగిస్తూ, రాష్టప్రతి వారిని నియమించడం జరుగుతున్నది. గవర్నర్లు రాజ్యాంగబద్ధంగా వ్యవహారిస్తూ, రాజ్యాంగాన్ని కాపాడాల్సి ఉంటుంది. కానీ విధి నిర్వహణలో రాజ్యాంగ సంక్షోభానికి కారకులు కారాదు. నిష్పక్షపాతంగా, రాజ్యాంగ స్పూర్తితో విధులు నిర్వహిస్తే సమస్యే రాదు. కానీ కొన్ని రాష్ట్రాల్లో అలా జరగడం లేదు. అందుకు కారణం కొంతమంది గవర్నర్లు రాజకీయాల్లో రాటుదేలినవారు కావడమే. ఆ రుచి, వాసన వారికి ఉంటుంది కాబట్టి గవర్నర్‌గా నియమితులైన తర్వాత తమకు పదవి కట్టబెట్టిన వారికి అనుకూల వైఖరితో మెలగడం ప్రారంభిస్తారు. అక్కడే సమస్య ఎదురవుతోంది. ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో రాజ్యాంగాన్ని పక్కనపెట్టి గవర్నర్లు విచ్చలవిడిగా, అరాచకానికి పాల్పడ్డారు. రాజ్యాంగాన్ని విస్మరించిన వారిని వెంటనే వెనక్కి పిలిపించాలి.
లోగడ కాంగ్రెస్ హయాంలోనూ ఒకరిద్దరు గవర్నర్లు తమ పరిధిని దాటి వ్యవహారించిన దాఖలాలున్నాయి. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిస్థితులు చక్కదిద్దిన సందర్భాలూ ఉన్నాయి. కానీ బిజెపి నేతృత్వంలో ఎన్డీయే అధికారం చేపట్టిన తర్వాత కొంతమంది గవర్నర్ల పాత్ర, కేంద్ర ప్రభుత్వ పాలన దారుణంగా ఉంది. లోగడ యుపిఎ ప్రభుత్వానికి, ఇప్పుడున్న ఎన్డీయే పాలనకు తేడా ఏమీ లేదు. కాంగ్రెస్ నుంచి భారత్‌కు విమోచన (కాంగ్రెస్ ముక్త భారత్) కలిగించాలంటూ బిజెపి ఎన్నికల ముందు నినాదాలు చేసి, హడావుడి చేసి ఇప్పుడు ఏమి సాధించిందో చెప్పాలి. ఏదైనా గవర్నర్లు తమ పరిధిని దాటి నిర్ణయాలు తీసుకోరాదు. తద్వారా ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతం కలుగుతుంది. పైగా ఫెడరల్ విధానం దెబ్బతింటుంది. గవర్నర్లు తమ పరిధి దాటి అతిగా ప్రవర్తించినప్పుడే గవర్నర్ల వ్యవస్థ రద్దుకు డిమాండ్ పెరుగుతున్నది. లోగడ టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావు కూడా గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాబట్టి ఈ వ్యవస్థపై జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మన తెలుగు రాష్ట్రాలకు ఉన్న గవర్నర్ తన విశేషాధికారాలు ఉపయోగించడం లేదు. ఫిరాయింపులు, పార్టీల విలీనాలు జరుగుతున్నా, చివరకు సదరు ఫిరాయింపుదారులు మంత్రివర్గంలో చేరుతున్నా, వారితో ప్రమాణ స్వీకారం చేయించడం దురదృష్టకరం. అటువంటి సమయాల్లో గవర్నర్ తన అధికారంతో రాష్ట్ర ప్రభుత్వానికి సరైన సూచన చేయాలి. గవర్నర్ కంటే పార్లమెంటుకే ఎక్కువ అధికారాలు ఉండాలి.

- సి. రామచంద్రయ్య ప్రతిపక్ష నేత, ఎపి శాసనమండలి