ఫోకస్

వ్యవస్థ నిర్వీర్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో ప్రధానంగా కొన్ని రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు చూస్తుంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతో కీలకమైన గవర్నర్‌ల వ్యవస్థ నిర్వీర్యమవుతున్నదా అనే అనుమానం కలుగుతోంది. తాజాగా అరుణాచల్‌ప్రదేశ్‌లో గవర్నర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుపట్టటం, జరిగిన అనైతికతను సరిదిద్దటం ఇందుకు ప్రబల నిదర్శనంగా పేర్కొనవచ్చు. రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో రాష్టప్రతి ఎంతటి క్రియాశీలక పాత్ర వహిస్తున్నారో.. అలాగే గవర్నర్లు కూడా రాజ్యాంగంతోపాటు ఆయా రాష్ట్రాల చట్టాలను కూడా పరిరక్షించడం వారి విధి. అయితే కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్ల పక్షపాత వైఖరి లేదా నిర్లిప్తత దురదృష్టకరంగా భావించాల్సి వస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌కున్న విధులు, బాధ్యతలు ఏమిటో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఆ విధంగా వ్యవహరించడం లేదు. నీటి వనరులు, హైకోర్టు విభజన.. ఆస్తుల పంపిణీ, ఉద్యోగుల విభజన వంటి అనేక కీలకాంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రేగుతున్నప్పటికీ గవర్నర్ జోక్యం చేసుకోకపోవడం శోచనీయం. రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలు అనేకానేక సమస్యలతో తల్లడిల్లిపోతుంటే గవర్నర్ మాత్రం ఇద్దరు ముఖ్యమంత్రుల పాలన భేషుగ్గా వుందంటూ కితాబు ఇస్తుండటమే కాదు ముఖ్యమంత్రుల భుజాలపై చేతులు వేసి చెవిలో రహస్యంగా మాట్లాడటం వెకిలిగా వుంది. ఈ పరిస్థితుల్లో ఎవరైనా గవర్నర్ వద్దకెళ్లి ముఖ్యమంత్రులపై ఫిర్యాదు చేయగలరా? అయినా ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా సమస్యలపై ఇప్పటికి పిసిసి ప్రతినిధి బృందం 15సార్లు పైగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసి లిఖితపూర్వక ఫిర్యాదులు చేసినా ఏ ఒక్క దానిపై కనీస విచారణ లేదు. అసలు ఆ కాగితాలు ఏమయ్యాయో అర్థం కావటం లేదు. రెండు రాష్ట్రాల్లోనూ భారీఎత్తున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కొనుగోలు, ఫిరాయింపులు జరుగుతున్నా స్పందన లేదు. దీన్నిబట్టి చూస్తే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గవర్నర్ల వ్యవస్థలో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నదా యనే అనుమానం కలుగుతోంది.

- డా.ఎన్.రఘువీరారెడ్డి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు