ఫోకస్

శాస్ర్తియత లేకపోతే చిక్కులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నాం. పరిపాలన వికేంద్రీకరణ కోసం కొత్త జిల్లాలు అవసరం. కాని ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అశాస్ర్తియ పద్ధతులను అనుసరిస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తోంది. ఇంతవరకు ముసాయిదా నోటిఫికేషన్‌పై 31 వేల ఫిర్యాదులు, అభ్యంతరాలు వచ్చాయి. వీటిని పరిష్కరించాలి. అఖిలపక్ష సమావేశాన్ని రెండోసారి నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. కాని ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. అధికారుల కంటే, విపక్ష పార్టీల సలహాలు తీసుకుని జిల్లాల వికేంద్రీకరణ చేయడం మంచిది.జనగాం, గద్వాల జిల్లాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ వస్తోంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించాలి. అడ్డుగోలు విభజన వల్ల జిల్లాల ప్రజల మధ్య చిచ్చు పెట్టినట్లవుతుంది. ప్రభుత్వం దసరా పండగకే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామనే పట్టుదలతో ఎందుకు ఉంది?. అభ్యంతరాలపై ప్రజల్లో చర్చకు పెట్టాలి. ప్రజాస్వామ్య బద్ధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవహరించాలి. తెలంగాణ రాష్ట్రం అవతరించి రెండేళ్లు దాటింది. పది జిల్లాల తెలంగాణలోనే పరిపాలన గాడిలో పడలేదు. కొత్త జిల్లాలకు మేము సుముఖమైనా, వీటి విషయంలో తొందరపాటు ఎందుకు ? కొత్త జిల్లాల ఏర్పాటును ఏ రాజకీయ పార్టీ వ్యతిరేకించడం లేదే? ప్రజలు కూడా సానుకూలంగానే ఉన్నారు. మండలాలు, రెవెన్యూ డివిజన్లను ఏ జిల్లాలో కలపాలి? కొత్త వాటిని ఎలా ఏర్పాటు చేయాలి. ఇప్పుడున్న జిల్లాల నుంచి ఏ ప్రాంతాలను విడదీయాలి? అనే దానిపై చర్చ కావాలి. వరంగల్‌జిల్లాలో హన్మకొండ జిల్లా ప్రతిపాదనను చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి ఆలోచించాలి. మొదటి ముసాయిదా నోటిఫికేషన్‌లో చాలా లోపాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దాలి. అసెంబ్లీకి ఎన్నికైన రాజకీయ పార్టీలను అఖిలపక్షం సమావేశానికి పిలవాలి. అలాగే ప్రజా సంఘాలతో కూడా ప్రభుత్వం సమావేశాలను ఏర్పాటు చేయాలి.

- కె.శివకుమార్ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వైకాపా రాష్ట్ర శాఖ