ఫోకస్

కమ్యూనిస్టులపై వ్యతిరేక ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచం ప్రస్తుతం ఒక గ్రామంగా మారిపోయింది. ఒక దేశంలో తయారయ్యే వస్తువులను ఇతర దేశాల్లో విక్రయిస్తున్నారు. అలాగే చైనాలో తయారయ్యే వస్తువులను భారత్‌లో విక్రయిస్తున్నారు. మన అవసరాలకోసం చైనా వస్తువులను కొనుగోలు చేస్తున్నాం. అలాగే మన దేశంలో తయారవుతున్న వస్తువులను కూడా చైనాలో మనం విక్రయిస్తున్నాం. చైనా వస్తువులను మనం దిగుమతి చేసుకోకూడదనుకుంటే, ఆ దేశం ఇతర దేశాలకు తమ వస్తువులను ఎగుమతి చేసుకుంటుంది. ఏ దేశమైనా తమ దేశంలో తయారయ్యే వస్తువులను విక్రయించుకునేందుకు మార్కెట్‌ను చూసుకుంటాయి. ఒకచోట విక్రయాలు జరగకపోతే మరోచోట విక్రయించుకుంటాయి. అలాగే భారత్‌లో చైనా వస్తువులకు మార్కెట్‌లేకపోతే ఇతర దేశాలకు ఎగుమతి చేసుకుంటుంది.
పాకిస్తాన్-్భరత్‌ల మధ్య శత్రుత్వం ఉండటం వల్ల చైనా వస్తువులను భారతీయులు కొనుగోలు చేయవద్దంటూ ఒక ప్రచారం తీసుకువచ్చారు. పాకిస్తాన్‌కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తోందని, సైనికబలాన్ని సమకూరుస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. చైనాకు ఆర్థికంగా మనమే పరోక్షంగా నిధులను అందిస్తున్నామని ప్రచారం జరుగుతోంది. వాస్తవ పరిస్థితి పరిశీలిస్తే పాకిస్తాన్‌కు మొదటి నుండి అమెరికా (యుఎస్‌ఎ) అండగా ఉంటోంది. ఆసియాలో ఒక స్థావరం కోసం అమెరికా పాకిస్తాన్‌ను పావుగా వాడుకుంటూ వస్తోంది. పాకిస్తాన్ ప్రధానంగా మూడు ‘ఎ’లపై ఆధారపడి ఉందని అంతా భావిస్తున్నారు. మొదటిది అమెరికా అండ ఉండటం, రెండోది ఆర్మీపై ఆధారపడటం, మూడోది ఆల్‌మైటీ (అల్లా)పై ఆధారపడటం అనేవి మూడు అంశాలంటూ ప్రచారం జరిగింది. పాకిస్తాన్‌కు అమెరికా ఆయుధసంపత్తిని అందివ్వడంతో పాటు సైనికంగా బలాన్ని సమకూరుస్తూ వస్తోంది. ఆర్థికంగా కూడా పాకిస్తాన్‌కు అమెరికా అండగా ఉంటూ వస్తోంది. పాకిస్తాన్‌కు అమెరికా అండగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అమెరికా నమ్మినబంటుగా పాక్ ఉంటూ వచ్చింది. దాంతో అమెరికా-్భరత్‌ల మధ్య స్నేహభావం పెద్దగా ఉండేది కాదు.
భారత్ విదేశాంగ విధానం ప్రస్తుతం మారింది. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాతో స్నేహపూర్వకంగా ఉంటున్నాడు. భారత్-అమెరికాల మధ్య మైత్రీబంధం పెరిగింది. వివిధ రంగాల్లో అమెరికా-్భరత్‌ల మధ్య మంచి మిత్రత్వం ఏర్పడింది. దాంతో చైనా, రష్యాలతో భారత్‌కు మొదటి నుండి ఉన్న మిత్రత్వం దూరమవుతోంది. అయినప్పటికీ, ఇటీవల గోవాలో నిర్వహించిన బ్రిక్స్ సమావేశానికి చైనా, రష్యా హాజరయ్యాయి. ఇటీవల పాకిస్తాన్‌లో జరగాల్సిన ‘సార్క్’ సమావేశానికి భారత్‌తోసహా ఇతర దేశాలు హాజరుకాబోవడం లేదని తెలపడంతో సార్క్ సమావేశాలు రద్దయిన విషయం గమనార్హం. ఈ పరిస్థితిలో చైనా వస్తువులను కొనుగోలు చేయవద్దంటూ ప్రచారం సాగడంలో అర్థం లేదు.

- కె. రామకృష్ణ, సిపిఐ ఎపి రాష్ట్ర కార్యదర్శి