ఫోకస్

నకిలీల మాయలో పడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికాలో చదవాలనుకునేవాళ్లు ప్రతిభావంతులై ఉండాలి. ఆర్థిక స్తోమత ఉండాలి. ఉన్నత చదువులు చదివి కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలనే తాపత్రయం ఉండాలి. మన దేశంలోని విశ్వవిద్యాలయాల కంటే ఉన్నత ప్రమాణాలతో ఉండే వర్శిటీల్లో చేరాలి. కాని తాజాగా అమెరికాకు వెళ్లి అక్కడి నుంచి బలవంతంగా పంపివేయబడిన విద్యార్థులే కాకుండా అనేకమంది విద్యార్థుల విషయంలో విచారకరమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో ప్రతిభ లేకపోయినా, ఏదోవిధంగా అమెరికాలో రెండేళ్ల ఎంఎస్ చదవాలి. అక్కడ పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తూ ఫీజులు కట్టుకుని కోర్సు ముగించేయాలనుకుంటున్నారు. అమెరికాలో కూడా 40 వరకు నకిలీ వర్శిటీలు ఉన్నాయి. అక్కడ కనీస వౌలిక సదుపాయాలు లేవు. బోధనా సిబ్బంది లేరు. ఆ వర్శిటీల్లో చదవితే గుర్తింపు లేదు. జిఆర్‌ఇ స్కోరు లేకపోయినా ఈ వర్శిటీలు అడ్మిషన్లు ఇస్తున్నాయి. చివరకు మనవాళ్లు టోఫెల్ పరీక్షను అక్రమ మార్గాల్లో పాసై, అమెరికాకు వెళుతున్నారు. వీరిని పరీక్షించిన అమెరికా అధికారులు ఆశ్చర్యబోతున్నారు. తల్లితండ్రులను కూడా పిల్లలు తప్పుదోవబట్టిస్తున్నారు. కనె్సల్టెన్సీల మాయాలో పడుతున్నారు. ఫండింగ్‌కోసం వడ్డీలు చెల్లిస్తున్నారు. మన విద్యార్థులు తక్కువ మొత్తం ఇచ్చినా పనిచేసేందుకు సిద్ధంగా ఉంటున్నారు. మన విద్యార్థుల బలహీనతను ఇక్కడ కనె్సల్టెన్సీలు, అక్కడ నకిలీ విశ్వవిద్యాలయాలు వాడుకుంటున్నాయి. ఒక బిటెక్ బయో టెక్నాలజీ విద్యార్థి అమెరికాకు వెళ్లి సంబంధం లేని రెండేళ్ల పర్యావరణ సైన్స్ కోర్సు చదువుతున్న సంఘటనలు ఉన్నాయి. అమెరికా వ్యామోహంలో పడి నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారు. మనం ఇకనైనా కళ్లు తెరిచి మన దేశంలోనే ఉన్న స్టాండర్ట్ వర్శిటీల్లో సీటు తెచ్చుకుని చదివేందుకు ప్రయత్నించాలి. అమెరికాలో కూడా మంచి వర్శిటీలు ఉన్నాయి. కాని అందరికీ అన్నింట్లో సీటు దొరకదు. మన ఆత్రుత, వ్యామోహాన్ని ఆసరాగా చేసుకుని కనె్సల్టెన్సీలు మోసం చేస్తున్నాయి. కనె్సల్టెన్సీల వలలో చిక్కుకుని మన విద్యార్థులు డబ్బును పొగొట్టుకుంటున్నారు. తల్లితండ్రులు ఆస్తులు అమ్మి దెబ్బతింటున్నారు. అమెరికాలోని ఫేక్ వర్శిటీల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

- సలాం బాబు షేక్, అధ్యక్షుడు, వైకాపా ఏపి విద్యార్థి సంఘం