ఫోకస్

సమర్థనీయమే కానీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దనోట్ల రద్దుపై ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నాం. కానీ ముందస్తు చర్యలేమీ తీసుకోకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దేశ ప్రయోజనాల దృష్ట్యా రూ.1000, రూ.500 నోట్లు రద్దు చేయడం, నకిలీ కరెన్సీని అరికట్టగలగడమే. పెద్దనోట్ల రద్దుకు ముందే ప్రత్యామ్నాయంగా ఎటిఎం, బ్యాంకుల్లో సరిపడు కొత్త కరెన్సీని ఏర్పాటు చేసుకొని పాత కరెన్సీ రద్దు ప్రకటన చేస్తే బాగుండేది. బ్యాంకుల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ప్రధాని తీసుకున్న నిర్ణయంతో నల్లధనం బయటకు వస్తుందే తప్పా.. అవినీతి తగ్గదు. 20 లక్షల కోట్ల భారత కరెన్సీలో 400 కోట్ల నల్లధనం ఒక లెక్క కాదు. వెయ్యి, ఐదు వందల నోట్ల రద్దుతో నకిలీ నోట్లు చలామణి కాకుండా పోతాయి. కానీ అవినీతి రూపుమాపడానికి దోహదపడదు. పెద్దనోట్ల రద్దుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తోంది. అయినప్పటికీ ప్రజలు సహనంతోనే ఉన్నారు. అయితే నల్లధనం వెలికితీయడంపై ప్రజలకు చేకూరే లాభం ఏమిటి? కరెన్సీ రద్దుతో పన్నులు తగ్గుతాయా? నిత్యావసర ధరలు తగ్గుతాయా? అనే విషయాన్ని ప్రధాని స్పష్టంగా చెప్పడం లేదు. దీంతో ప్రజల్లో ప్రధాని సానుభూతి కోల్పోయే పరిస్థితులు దాపురించాయి. డబ్బు తగ్గాలి.. పొదుపు జరగాలి.. భారత్ అవినీతి రహిత దేశంగా మారాలి. ఇక వ్యాపారాలు తగ్గాయంటే. ఇది వాస్తవమే. కానీ తాత్కాలికమే. ఏదైనా సాధించాలంటే.. ఏదో కొంత వదలాలి. అది నష్టమే కావచ్చు. లాభమే కావచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా బాగానే దెబ్బతిన్నాయి. దీంతో దేశ ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వమే చూసుకుంటుంది. సామాన్యుల స్థితిగతులు మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ సర్దుకుపోతాయనుకుంటున్నాం. ఫారన్ ఎక్సేంజ్ కూడా తగ్గిందంటే.. నకిలీ కరెన్సీకి అడ్డుకట్ట పడిందనే చెప్పవచ్చు. అయితే కొత్త నోట్లు కూడా నకిలీవి రావని నా ఉద్దేశం కాదు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం తీసుకువచ్చిన రెండు వేల రూపాయల నోట్లు కూడా అప్పుడే నకిలీ వయ్యాయి. ఆంధ్రా, తెలంగాణలో పలుచోట్ల నకిలీ కొత్తనోట్లు పట్టుబడ్డ సంగతి తెలిసిందే. సామాన్యులకు కలిగే బాధలను కూడా ప్రధాని నరేంద్ర మోదీ గుర్తించాలి. పేదలకు, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఎలాంటి హానీ జరగదని భరోసా ఇస్తున్న ప్రధాని స్పష్టంగా ప్రకటించాలి. పెద్దనోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతోన్న పేద, మధ్యతరగతి వారికి ఎలాంటి న్యాయం చేస్తారో.. వారు నష్టపోకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో ప్రకటించాల్సిన అవసరం ఉంది. పెద్దనోట్ల రద్దుతో నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేయడంతోపాటు అవినీతి రహిత దేశంగా భారత్‌కు ఒక గుర్తింపు వస్తుందనే భావిస్తున్నాం. తాత్కాలిక ఇబ్బందులను అధిగమించాలని, కేంద్రం తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇవ్వాలని సూచిస్తున్నాం.

-పాండురంగారావు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, లోక్‌సత్తా