ఫోకస్

ఉగ్రవాద అడ్డా.. హైదరాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టైగర్ ఫారెస్ట్, జింకల అటవీప్రాంతం అంటూ మన దేశంలో ప్రత్యేకంగా అడవులు ఉన్నాయి, అలాగే హైదరాబాద్ ‘ఉగ్రవాదుల అడవి’గా మారిపోయింది. దేశంలో ఏ ప్రాంతంలో ఉగ్రవాద దాడి జరిగినా దానికి మూలాలు హైదరాబాద్‌లోనే ఉంటున్నాయి. రాజకీయ కారణాల మూలంగా ఉగ్రవాదులకు ప్రభుత్వం అనుకూలంగా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. అందుకే హైదరాబాద్ ఉగ్రవాదులకు కేంద్రంగా మారిపోయింది. దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు జరిగితే, అందుకు కారకులైన వారిని, ఆయా రాష్ట్రాల పోలీసులు హైదరాబాద్ వచ్చి ఉగ్రవాదులను వేటాడి తమ వెంట తీసుకువెళుతున్నారు. వాస్తవానికి ఇక్కడి ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటు. ఉగ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించడం లేదన్న అపవాదు ప్రభుత్వానికి వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న హిజ్బుల్ ముజాహదీన్, తాంజిమ్ ఇస్లాహుల్ ముస్లిమీన్, ఫసి (ఐఎస్‌ఐ ఏజంట్), అల్‌జెహాద్, లష్కరే తోయబా, ఇండియన్ ముస్లిం ముజాహిదీన్, హర్కుతుల్ జెహాద్ అల్ ఇస్లామీ తదితర సంస్థలు విధ్వంసాలకు పాల్పడుతున్నాయి.
ఉగ్రవాదానికి మతం లేకపోయినా, ఉగ్రవాదులకు మతం ఉంది. కేవలం ఒకే మతానికి చెందిన యువత ఉగ్రవాదులుగా ఎందుకు మారుతున్నారో విస్తృతంగా, బహిరంగంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మైనారిటీలకు ప్రత్యేక హోదా ఇస్తూ, ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తున్నప్పటికీ, చాలా మంది భారత్‌కు వ్యతిరేకంగా మారుతున్నారు. దేశంలో చట్టానికి లోబడే అన్ని మతాలు, అన్ని కులాలవారు ఉండాలి. కుటుంబ నియంత్రణతోసహా అన్ని చట్టాలకు లోబడే జీవించాల్సి ఉంటుంది. ఏ మతం కానీ, ఏ కులం కానీ చట్టానికి అతీతులుకారు. ఉగ్రవాదులకు ఎవరైనా అండగా నిలిస్తే, పనిచేస్తే అలాంటి వారిపై కూడా చట్టపరంగా చర్య తీసుకోవాలి. హైదరాబాద్‌లో ఉగ్రవాదులకు కొన్ని రాజకీయ పార్టీలు బహిరంగంగా మద్దతు ఇస్తున్నాయి. పోలీసు కార్యాలయాలపై కూడా దాడులు చేస్తున్నా, అలాంటి సంఘటనలను రాజకీయ పార్టీలు ఖండించకపోవడం ఆశ్చర్యం వేస్తోంది. ఉగ్రవాదులుగా మారుతున్న యువత తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించాలి. తల్లిదండ్రులకు తెలిసే వారి పిల్లలు ఉగ్రవాదులుగా మారుతున్నారా? తెలియకుండా వెళ్లిపోతున్నారా? అన్న అంశంపై పరిశీలన జరగాలి.
జమ్మూకాశ్మీర్‌లో అన్నీ సబ్సిడీపై ఇస్తుంటే అక్కడ ఏం జరుగుతోంది? కాశ్మీరీ పండిట్లపై దాడులు చేస్తుంటే ఎవరూ నోరుమెదపలేదు. ఈ కారణంగానే మెజారిటీ ప్రజల్లో నిరాశ పెరిగిపోతోంది. ఉగ్రవాదం పెరిగిపోకుండా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తు అంధకారబంధురంగా మారుతుంది. అమాయకుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది. చట్టాలకు విలువ లేకుండా పోతుంది. ఉగ్రవాదులకు, ఉగ్రవాదానికి రాజకీయ నాయకులు మద్ధతు ఇవ్వకపోతే ఉగ్రవాదాన్ని మన పోలీసులు మట్టుబెడతారనడంలో సందేహం లేదు. ఏది ఏమైనా ఉగ్రవాదుల పట్ల ఉగ్రవాదం పట్ల ఉక్కుపాదం మోపాల్సిందే.

- ఎం. రామరాజు, అధ్యక్షుడు, విహెచ్‌పి, తెలంగాణ.