ఫోకస్

ఇది అంతర్జాతీయ సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉన్నత విద్య కోసం అమెరికా వంటి సంపన్న దేశాలకు వెళ్లి అక్కడ విద్యార్థులు ఇబ్బందులెదుర్కొవటం కేవలం భారత్, అమెరికా దేశాలకు సంబంధించింది మాత్రమే కాదు. ఇదో గ్లోబల్ సమస్య. భారత్ నుంచి ప్రతి సంవత్సరం 12వేల మంది, చైనా నుంచి మరో 12వేల మంది విద్యార్థులు అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ వంటి పాశ్చాత్య దేశాలకు వెళ్తున్నారు. అమెరికా యేతర దేశాల్లో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటం వల్ల అమెరికా వెళ్లాలన్నది ప్రతి విద్యార్థి తమ గమ్యస్థానంగా భావిస్తున్నాడు. వీరిలో ఎక్కువ మంది భారత విద్యార్థుల్లో విదేశాల్లో ఎంటెక్ చదివితే మంచి ఉపాధి దొరుకుతుందని నేడు ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థి భావిస్తున్నాడు. అది అవసరమని కూడా అనుకుంటున్నారు. అందుకే విదేశాల్లో ఉన్నత చదువులపై విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భారత్ నుంచి వెళ్లే విద్యార్థుల్లో ఎక్కువ మంది పేద, మధ్య తరగతులకు చెందినవారే. ఇక్కడ లక్షల రూపాయలను అప్పుగా చేసి ఉన్నత విద్య కోసం అక్కడకు వెళ్తున్న విద్యార్థులకు అక్కడున్న మూడంచెల ఉన్నత విద్యా విధానం అర్థం కావటం లేదు. ఇక్కడ చేసి వెళ్లిన అప్పులను తీర్చటంకూడా తమ బాధ్యతగా భావిస్తున్నారు. అమెరికాలోని ఇలాంటి కొన్ని కాలేజీలు కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే నడుస్తాయి. దీన్ని మంచి అవకాశంగా భావిస్తూ హోటళ్లు, గ్యాస్ కంపెనీల్లో గంటల వారీగా వేతనంకోసం పనులు చేసుకుంటున్నారు. కానీ అమెరికా ప్రభుత్వం పరిమిత సంఖ్యలో వర్క్ పర్మిట్లు జారీ చేస్తున్నందున, కొందరు మన దేశ విద్యార్థులు వర్క్ పర్మిట్లు లేకుండా పనిచేస్తూ గంటకు కేవలం నాలుగు నుంచి ఆరు డాలర్లు మాత్రమే సంపాదిస్తున్నారు. ఇలాంటి విద్యార్థుల ఆర్థిక, కుటుంబ పరిస్థితులను అమెరికా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని, మానవతా ధృక్పథంతో విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు వీలైనన్ని ఎక్కువ వర్క్ పర్మిట్లు జారీ చేయాలి. అలాగే చేస్తే వారు అధికారంగా పనిచేస్తూ, కొంత ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశమేర్పడుతోంది. వేగవంతమైన మార్పులతో ఏ విధంగా గ్లోబలైజేషన్ జరుగుతుందో, అంతే వేగంగా దారిద్య్ర నిర్మూలన ప్రయత్నాలు కూడా జరగటం ఒక్కటే ఇలాంటి సమస్యలకు పరిష్కారం.

-చుక్కా రామయ్య, విద్యావేత్త