ఫోకస్

దాడిని తీవ్రంగా పరిగణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మత ఛాందసవాదం హద్దులు మీరుతోంది. ఈ కారణంగానే మత ఉగ్రవాదం పుట్టుకొచ్చింది. ఇది ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. ఎన్నో ఏళ్లనుంచి చాపకింద నీరులా విస్తరిస్తూ వచ్చింది. కాబట్టి దీన్ని ఒక్కసారిగా తుదముట్టించడం అంత సులువు కాదు. అత్యంత పటిష్టమైన భద్రత ఉన్న పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు దాడికి దిగారంటే ఇది చాలా తీవ్రంగా పరిగణించాలి. ఇందుకు కారణం చాలావరకు అమెరికా సామ్రాజ్యవాద శక్తులే. ఉగ్రవాదాన్ని అణచివేసే క్రమంలో మిగిలిన దేశాలతో కలిసి రాకపోవడం వల్ల చాలా సందర్భాల్లో ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. ఇస్లామిక్ మతచాందసవాదం పెరిగిపోవడం, దానికితోడు ఉగ్రవాదం పేరుతో అరాచక శక్తులు పేట్రేగిపోవడం దారుణమని భావించాలి. ఇస్లామిక్ ఉగ్రవాదం దేశానికి ఎంత ప్రమాదకరంగా మారిందో హిందూ ఉగ్రవాదం కూడా అదేస్థాయిలో పెరిగిపోతోంది. అసహనం పెరిగిపోయి మరో మతంపై దాడి చేయడం వల్ల కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. దాడులు ఎవరు చేసినా సహించరాదు. కఠినంగా అణచివేయాలి. లేకపోతే దేశ సమగ్రతకే ముప్పు వాటిల్లుతుంది. మన దేశానికి విదేశీ వ్యవహారాలు, సంబంధాలు ప్రస్తుతం సజావుగానే పని చేస్తున్నాయి. కాకపోతే అవి మంచి ఫలితాలు ఇస్తే మంచిది. అమెరికా చాలా సందర్భాల్లో ఉగ్రవాదానికి వత్తాసు పలకడం వల్లే ఐఎస్‌ఐ కార్యకలాపాలు విస్తరించడానికి దోహదపడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయిన ఉగ్ర కార్యకలాపాలను అన్ని పార్టీల సలహాలు, సూచనలతో నిరోధించే ప్రయత్నం జరగాలి. సమగ్రమైన విధానాన్ని భారతదేశం అనుసరించలేకపోతోంది. అసలు ఉగ్రవాదానికి ఊతమిస్తోంది గ్లోబలైజేషన్. దీని ప్రభావం ఎంతో ఉంది. గ్లోబలైజేషన్ వల్ల ఎంత ఉపయోగం ఉందో అంత నష్టం కూడా ఉందని చెప్పాలి. తీవ్రవాదం, ఉగ్రవాదానికి ప్రాతిపదికే లేకుండా చేయాలంటే వ్యూహాత్మక వైఖరితో ముందుకెళ్లాలి. ఈశాన్య భారతదేశంలో కొన్ని శక్తులు మరోరూపంలో తీవ్రవాదులుగా మారుతున్నారు. ఇందుకు స్థానికంగా అనేక కారణాలు ఉన్నాయి. కానీ కారణాలు ఏమైనప్పటికీ అది హిందూ ఉగ్రవాదమా, ఇస్లామిక్ ఉగ్రవాదమా లేక మరొకటా అనేది చూడకుండా కఠినంగా అణచివేయాలి. పఠాన్‌కోట్ వంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.

- కె. రామకృష్ణ, సిపిఐ, ఎపి రాష్ట్ర కార్యదర్శి.