ఫోకస్

శుభ సూచకమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా ఎన్నిక కావడం భారత్‌కు శుభ సూచకం. మనం అనుమానపడాల్సిన పని లేదు. భారత్‌కు కలిసి వచ్చే అవకాశం ఉంది. మన దేశంలో మోడీ విజయం లాంటిదే అమెరికాలో ట్రంప్ విజయం. మన దేశం శక్తివంతంగా ఉండాలి, దేశ ప్రజలకు మేలు జరగాలి, దేశానికి గౌరవం పెరగాలి అని మోడీ ఏ విధంగా భావించారో, అమెరికా విషయంలో ట్రంప్ అదే విధంగా భావించారు. సాధారణ అమెరికా పౌరుని భాషలో ట్రంప్ మాట్లాడారు. సరిగ్గా మోడీ అదే విధంగా మాట్లాడారు. మోడీ విజయాన్ని కొన్ని శక్తులు సహించలేక అసహం అంటూ ఏ విధంగా ప్రచారం చేశారో, సరిగ్గా అమెరికాలో అదే విధంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఇంతకాలం అధికారం అనుభవించినవారు, ప్రయోజనాలు పొందినవారు ట్రంప్ విజయాన్ని సహించలేక పోతున్నారు.
ట్రంప్ భారత దేశానికి, భారతీయులకు వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదు. భారత సంప్రదాయాలు, సంస్కృతి, భారతీయ విలువలు తనకు ఎంతో ఇష్టం అని, హిందువులన్నా గౌరవం అని చాలాసార్లు చెప్పారు. భారతీయుల ఉద్యోగాలు పోతాయి? ఉద్యోగాలను తీసేస్తారు అనే ప్రచారం నిజం కాదు. అమెరికాలో కొన్ని రంగాల్లో భారతీయుల భాగస్వామ్యం ఎక్కువగా ఉంది. అమెరికా అంతరిక్ష పరిశోధనలో 16 శాతం మంది భారతీయులే ఉన్నారు. మైక్రోసాఫ్ట్‌లో 30శాతం మంది భారతీయులు ఉన్నారు. ఐటితోపాటు అనేక రంగాల్లో భారతీయులు సేవలు అందిస్తున్నారు. మేధోపరమైన సేవలు అందిస్తున్న వీరిని తొలగించే అవకాశం ఎంతమాత్రం లేదు. అమెరికా భారత్‌తో మంచి సంబంధాలు కోరుకుంటోంది.
అమెరికా, చైనాల మధ్య సంబంధాలు బెడిసికొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాకు భారత్ స్నేహం అవసరం, భారత్ మార్కెట్ అవసరం. దీనిని దృష్టిలో పెట్టుకునే ట్రంప్ తన బృందంలో ఎంతోమంది భారతీయులకు ఉన్నత స్థానం కల్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాపై మనం అనవసర అనుమానాలు పెట్టుకోవలసిన అవసరం లేదు.
మేధోపరమైన ఉద్యోగాల్లో భారతీయులకు ప్రాధాన్యత ఇస్తారు. అదే సమయంలో అమెరికా వారికి చెందాల్సిన ఉద్యోగాలు అమెరికన్‌లకు చెందాలి అని ట్రంప్ కోరుకోవడాన్ని మనం తప్పు పట్టకూడదు. ఏ దేశంవారైనా తమ దేశానికి చెందినవారికి ఉపాధి లభించాలని, తమ దేశం శక్తివంతంగా ఉండాలని కోరుకుంటారు. ట్రంప్ కూడా అలానే కోరుకుంటున్నారు. ట్రంప్ నాయకత్వంలోని అమెరికా, ఇండియాల మధ్య కచ్చితంగా సంబంధాలు బాగుంటాయి. ఈ సంబంధాలు మన దేశానికి ప్రయోజనకరంగా ఉంటాయి.

- త్రిపురనేని హనుమాన్ చౌదరి ప్రజ్ఞ్భారతి