ఫోకస్

భారత్‌ను ఎవరూ ఏమీ చేయలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డొనాల్డ్ ట్రంప్ వల్ల భారత్‌కు వచ్చే నష్టమేమీ లేదు. భారత్, అమెరికా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు. అమెరికా ప్రోత్సాహం లేకపోతే భారత్ మనుగడ సాధించలేదనే వాదన తప్పు. భారత్‌కు ఐదువేల సంవత్సరాల ఘనచరిత్ర, సంస్కృతి ఉన్నాయి. మన దేశ ప్రజలు 1500 సంవత్సరాలుగా ఎన్నో ఆటుపోట్లు, యుద్ధాలు ఎదుర్కొన్నారు. స్వావలంభన, ఉన్నదాంట్లో ఆనందం పొందడం, కష్టపడడం, సంతృప్తి అనేవి భారతీయుల లక్షణాలు. ప్రజాస్వామ్యం, సంయమనం, శాంతి అనే విశిష్ట లక్షణాలు భారత ప్రజల్లో ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వల్ల ఇక్కడి విద్యార్థులు ఇకపై అమెరికాకు వెళ్లలేరు. వీరికి వీసాలు ఇవ్వరు. అక్కడ వర్శిటీల్లో చదువుకునే అవకాశం కోల్పోతారు. దీనివల్ల అమెరికాకు వెళ్లి చదివి, ఉద్యోగం చేస్తామనుకునే యువతకు నిరాశకు గురవుతుందనే దుష్ప్రచారం పెరిగింది. అలాగే అమెరికాలో ఐటి ఇతర కంపెనీల్లో పనిచేస్తున్న భారత్ యువతను తిప్పి పంపించివేస్తారనే ప్రచారం కూడా ఉంది. ఇవన్నీ కాలం నిర్ణయిస్తాయి. ఒక్కటి మాత్రం నిజం. అమెరికా యువతలో పెల్లుబుకుతున్న నిరాశను ఆసరాగా చేసుకుని, లోకల్ సెంటిమెంట్‌తో ట్రంప్ గెలిచారు. ఒకవేళ ట్రంప్ తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటే భారత్ ఒక్కటే కాదు, ప్రపంచంలో చాలా దేశాలు నష్టపోతాయి. కాని దీర్ఘకాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ నష్టపోతుంది. మొదటి నుంచి అమెరికా ప్రజాస్వామ్య ముసుగులో ప్రపంచ పోలీసు పెత్తనం పాత్రను పోషిస్తోంది. అక్కడ డెమొక్రాట్లు లేదా రిపబ్లికన్లు ఎవరు గెలిచినా, భారత్ అనుకూల నిర్ణయాలు పెద్దగా ఇంతవరకు తీసుకున్న దాఖలాలు లేవు. సోవియట్ రష్యా పతనం, తూర్పు ఐరోపా దేశాల్లో కమ్యూనిస్టు దేశాల్లో తిరుగుబాట్లు తదితర కారణాల వల్ల అమెరికా అనివార్యంగా బలమైన శక్తిగా అవతరించింది. క్యూబా ఒక్కటే అమెరికా దాష్టీకాన్ని ఎదురొడ్డి నిలిచింది. భారత యువత ట్రంప్ వల్ల తమకు నష్టం జరుగుతుందనే భయాందోళనలు విడనాడాలి. మొదటినుంచీ భారత్-అమెరికా సంబంధాలు అంతంతమాత్రమే. అమెరికా మన దేశం తరఫున కిష్టపరిస్థితుల్లో ఎప్పుడూ వాదనలు వినిపించలేదు. చరిత్ర తెలుసుకుంటే అమెరికావల్ల మనకు ఏమాత్రం ప్రయోజనం చేకూరిందో అర్థమవుతుంది.

- విశే్వశ్వరరెడ్డి వైకాపా శాసనసభాపక్ష ఉపనేత, ఆంధ్రప్రదేశ్