ఫోకస్

సంబంధాలు చెడిపోవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ట్రంప్‌ది ఒక విచిత్రమైన వ్యక్తిత్వం. అమెరికా సమాజంలోని వక్రీకరణలు, అసమానతలు, నిరుద్యోగ యువతలో నిరాశ, నిస్పృహలు, అసంతృప్తి, మహిళలు, నల్ల జాతీయుల పట్ల వివక్ష వంటి వాటినుంచి ట్రంప్ పుట్టుకొచ్చాడు. అమెరికాకు ఇతర దేశాల నుంచి వచ్చిన కోటి 30 లక్షల మంది ఉద్యోగులు వెళ్లిపోతే ఆ ఉద్యోగాలు తమకు వస్తాయని, అలాగే కొత్తగా 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఎన్నికల సమయంలో ట్రంప్ అక్కడి వారిలో ఆశలు కల్పించారు. ట్రంపు అధికార పగ్గాలు చేపడితే తమను వెనక్కి పంపిస్తారా? అనే చర్చ అక్కడున్న ఇతర దేశాల వారిలో తలెత్తింది. అయితే ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా చేయడానికి ట్రంప్‌కు వెసులుబాటు ఉండదని చెప్పవచ్చు. హిందు మతతత్వవాదులు, జాతీయవాదులు హిందూ రిపబ్లికన్ అసొసియేషన్‌గా ఏర్పడి నిధులు సేకరించి ట్రంప్‌కు మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో భారతదేశానికి చెందిన వారిని వెనక్కి పంపిస్తారని అనుకోవడం లేదు. పైగా అమెరికాలో కార్పొరేట్ వ్యవస్థ బలోపేతమైంది. కార్పొరేట్ సంస్థలు తమ వద్ద పని చేస్తున్న నిపుణులను వెనక్కి పంపించడానికి ససేమిరా ఒప్పుకోవు. ఆయుధాల వ్యాపారం, ఆయుధాల విక్రయానికి అమెరికాకు భారత్ అతిపెద్ద మార్కెట్. ఇప్పటికే లక్షల కోట్ల విలువైన ఆయుధాలను అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేసింది. ఇంకా 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆయుధాలను కొనబోతోంది. ఇంత పెద్ద మార్కెట్‌ను అమోరికా ఎట్టి పరిస్థితులో వదులుకోదు. భారత్‌తో ఆర్థిక, మార్కెట్ ప్రయోజనాలు ముడిపడి ఉండటం వల్ల కూడా భారత్‌ను అమెరికా దూరం చేసుకోదు. ట్రంపు పాలనలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటే చేసుకోవచ్చు కానీ భారత్‌తో సంబంధాల విషయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని అనుకుంటున్నా. భారత్‌తో సంబంధాల కోసమే పాకిస్తాన్‌ను అమెరికా దూరంగా పెట్టింది. చైనాతో ఉన్న విరోధంవల్ల కూడా భారత్‌ను బలమైన దేశంగా తీర్చిదిద్దాలని అమెరికా భావిస్తుంది. చైనా-అమెరికా మధ్య సంబంధాలు పెరిగితే తప్ప భారత్‌ను అమెరికా దూరం చేసుకోదు. దానికి అవకాశం ఇప్పట్లో లేకపోవడంతో ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టినా భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపదనే చెప్పవచ్చు.

- ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, సామాజిక విశే్లషకుడు