ఫోకస్

అపోహలకు దూరంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దటంలో ‘్భయం’ కీలకపాత్ర వహిస్తుంది. అది భౌతికపరమైన భయం కావచ్చు లేదా ఆధ్యాత్మికపరమైన భయం కావచ్చు. భౌతికపరమైన భయం కంటే కూడా ఆధ్యాత్మికపరమైన భయం ఎంతో తీవ్రతరంగా భావించాల్సి వుంటుంది. భౌతికపరమైన భయాలన్నీ కూడా ప్రస్తుత జీవనానికి సంబంధించినవి. ఆధ్యాత్మిక భయాలు మాత్రం సెంటిమెంట్‌తో కూడినవి. తాను చేసే దైవ కార్యక్రమాలను బట్టి అల్లా లేదా జీసస్ లేదా శైవ సన్నిధిలో, ఇవేమీ లేనిపక్షంలో స్వర్గ లోకంలో విహరించటానికి సంబంధించినవి కావచ్చు. ఈ అంశాలన్నీ ఆసరా చేసుకుని అపోహలు, అబద్దాలను ప్రచారం చేసుకోవటం ద్వారా వ్యక్తులను ఉగ్రవాదం వైపు కొందరు పయనింపచేస్తున్నారు. నిజానికి ఏ మతంలోనూ హింసా చర్యలను ప్రేరేపించిన దాఖలాలు లేవు. స్వార్ధపర శక్తులు, వ్యక్తులు అబద్దాలను ఆధ్యాత్మికత జోడించి తమ పబ్బం గడుపుకోటానికి లేదా తమ అవసరాలను తీర్చుకోవడానికి ఉగ్రవాదాన్ని సృష్టిస్తున్నారు. మతం ముసుగులో ఆ శక్తులు, వ్యక్తులు ఒక పథకం ప్రకారం ఫలానా పనిచేస్తే భగవంతుని పక్కకు చేరుకోవచ్చని సర్వ పాపాలు హరిస్తాయంటూ యువతను తప్పుదారి పట్టిస్తూ మతం వ్ఢ్యలుగా తయారుచేస్తున్నారు. ఈ కుల, మత, వ్ఢ్యౌం నుంచి బైటపడటానికి అన్ని రాజకీయ శక్తులు కూడా హేతుబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం వుంది. భగవంతుని సాన్నిధ్యానికి చేరుకోటానికి మానవసేవ, సమాజసేవ అనే ప్రధాన అంశాలను యువతలో చొప్పించాలి. అలా జరక్కపోవటం వలన మతవ్ఢ్యౌంతో తాము చనిపోయేలోగా ఏదో చేయాలనే ప్రగాఢ కోరికను యువతలో ప్రేరేపించటం వలనే ఉగ్రవాదం జడలు విదిలిస్తున్నది. భారత్-పాక్ రెండూ శాంతియుత చర్చలకు సిద్ధపడుతున్న సమయంలో ఉగ్రవాదులు రెచ్చిపోయిన తీరు నేడు ప్రపంచ వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్లుగా మానవాళికి శత్రువులుగా పరిణమించిన ఉగ్రవాద చర్యలకు తక్షణం తెరవేసేందుకు నడుం కట్టాల్సిన సమయం ఆసన్నమైంది.

- కాళిదాసు వెంకట రంగారావు, ఐపిఎస్ డెప్యూటీ పోలీస్ కమిషనర్, విజయవాడ