ఫోకస్

అమెరికా తీరు మారుతుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సంచలన విజయం సాధించారు. గెలుపు తనదే అంటూ మొదటినుంచీ ఆత్మవిశ్వాసంతో ఉన్న డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు ట్రంప్ షాక్ ఇచ్చారు. ట్రంప్ 276 ఎలక్టోరల్ ఓట్లను కైవసం చేసుకోగా, హిల్లరీ 218 ఓట్లతో వెనుకబడిపోయారు. అధ్యక్ష పీఠం అధిరోహించడానికి కావల్సిన మ్యాజిక్ ఫిగర్ 270 ఓట్లు మాత్రమే. దాంతో అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ ఈ నెల 20వ తేదీన వైట్‌హౌస్ క్యాపిటల్ బిల్డింగ్ వద్ద ఏర్పాటు చేసే కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అమెరికాలో మొత్తం 51 రాష్ట్రాల్లో ఎలక్టోరల్ ఓట్లు పరంగా చూస్తే హిల్లరీకి 42.2 శాతం, ట్రంప్‌కు 56.5 శాతం వచ్చాయి. అయితే పాపులర్ ఓట్లు చూస్తే హిల్లరీకి 48.2 శాతం, ట్రంప్‌కు 46.2 శాతం ఓట్లు దక్కాయి. అమెరికా మనది, మనందరం అమెరికాకోసం పనిచేయాలని గెలుపొందిన ట్రంప్ పిలుపునిచ్చారు. గెలుపు ఓటమిలను పక్కన పెట్టి అమెరికా అభివృద్ధికి అందరూ కలిపి పనిచేద్దామని విజ్ఞప్తి చేశారు. అమెరికాను పునర్నిర్మించాల్సి ఉందని, ఆర్థిక అభివృద్ధిని రెండింతలు చేయాల్సి ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా ఎప్పుడూ తన దృష్టిలో నెంబర్ వన్ అని, రెండో స్థానంలో అమెరికాను చూడలేనని అన్నారు. అమెరికన్ల బంగారు భవిష్యత్ కోసం తాను శక్తి వంచన లేకుండా పనిచేస్తానని ట్రంప్ తన తొలి ప్రసంగంలో చెప్పారు. అయితే ట్రంప్ ఎన్నికైన నాటినుండి అమెరికాలో నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ఆయన ప్రమాణస్వీకారోత్సవాన్ని బహిష్కరించాలంటూ పలు సంస్థలు పిలుపునిచ్చాయి. డిజరస్ట్ జె 20, బ్లాక్ లైవ్స్ మేటర్ తదితర సంస్థలతోపాటు పలు మానవ హక్కుల గ్రూపులు ప్రమాణస్వీకారోత్సవాన్ని బహిష్కరించాలని నిర్ణయించడాన్ని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. మరోపక్క ఒబామా కేర్ పథకాన్ని రద్దు చేస్తామని ట్రంప్ చేస్తున్న ప్రకటనలు సంచలనాన్ని రేకెత్తిస్తున్నాయి. ప్రధానంగా హెచ్-1 బి వీసాలతోపాటు ఉద్యోగాలపై వెళ్లే ఇతర దేశస్థుల వీసాలను కూడా కుదిస్తామని ట్రంప్ ప్రకటించారు. వీటన్నిటి ప్రభావం భారత్‌పై ఎక్కువగా పడుతుందని విశే్లషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఒబామా ప్రభుత్వం అమలుచేస్తున్న ఎఫోర్డబుల్ కేర్ యాక్ట్ (ఎసిఎ-ఒబామా కేర్ )ను రద్దు చేయాలని ప్రతిపాదించడంపై డెమొక్రటిక్ పార్టీ సభ్యులు దేశ వ్యాప్తంగా భారీ నిరసనలు తెలియజేస్తున్నారు. పెన్సిల్వేనియా అవెన్యూ చుట్టూ దారిపొడవునా కేపిటల్ హిల్ చుట్టుపక్కలా నెలకొల్ప తలపెట్టిన 12 చెక్ పాయింట్ల వద్ద తమ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాలని నిరసన గ్రూప్‌లు చూస్తున్నాయి. దీనికితోడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామాపై వ్యంగ్యోక్తులు విసరడం కూడా సందట్లో సడేమియాగా మారాయి. వైట్‌హౌస్‌లోకి ప్రవేశించే వ్యక్తికి చర్మం కాస్తా మందంగా ఉండటం, మంచి శారీరక ధృడత్వం అవసరమని ఒబామా చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ దీటుగానే స్పందించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వ వైఖరి భారత్‌పై ఎలా ఉండబోతోందనే దానిపై విశే్లకుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.
* * *