ఫోకస్

నిఘా వైఫల్యం కనిపిస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో ఉగ్రవాదాన్ని అణచివేస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం, రక్షణ శాఖ డొల్లతనం పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై జరిగిన దాడి బయటపెట్టింది. ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు దాడికి దిగినా సమర్థవంతంగా ఎదుర్కొని నష్టం జరగకుండా రక్షణ దళాలు చూడగలిగారు. అయితే అసలు ఉగ్రవాదులు దాడికి దిగుతున్న విషయాన్ని ముందే పసిగట్టి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. రక్షణ వ్యవస్థలో ఉన్న లొసుగులను నివారిస్తే మంచిది. ఒక్క పాకిస్తాన్ నుంచే ఈ కార్యకలాపాలు జరుగుతున్నాయని అనుకుంటే పొరపాటు. మన దేశంపై అమెరికా ఒత్తిళ్లు ఎక్కువగా ఉండడం కూడా కారణమని చెప్పాలి. పాకిస్తాన్‌ను బద్ధ శత్రువుగా భావించిన భారతదేశం ఒక్కసారిగా మిత్ర దేశంగా భావించడం ప్రధాని నరేంద్రమోదీ తప్పు. అల్‌ఖైదా వంటి మతోన్మాద శక్తులు అమెరికా అండ చూసుకునే కదా వేళ్లూనుకుంది. సకాలంలో స్పందించి మొదటినుంచీ ఒకే తీరుగా ఎదుర్కొనే శక్తి సామర్ధ్యాలను కలిగి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. ఉగ్రవాదానికి ఏదో ఒక మతం రంగు తగిలించడం సరికాదు. అది ఒక్క మైనార్టీ మతమో, మెజార్టీ మతంగానో చూడకూడదు. ఎటువంటిదైనా కఠినంగా అణచివేయాలి. ఆర్‌ఎస్‌ఎస్ వంటి శక్తుల మార్గదర్శకత్వంలో పనిచేస్తున్న మోదీ ప్రభుత్వం హిందూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. భారత దేశంలోనే సిక్కు ఉగ్రవాదం, ఉల్ఫా ఉగ్రవాదం, నాగా తీవ్రవాదం ఇలా చాలా పుట్టుకువచ్చాయ. అసలు ఇలాంటివి ఎందుకు పుట్టుకువస్తున్నాయి? వాటి పుట్టుపూర్వోత్తరాలు అధ్యయనం చేసి అలాంటి అసంతృప్తిని నివారించాలి. ఇది వదిలేసి ఎప్పుడు దాడి జరిగితే అప్పుడు ప్రకటనలు చేయడం సరికాదు. అసహన కార్యకలాపాలు పెరిగితే యువత ఐఎస్‌ఐ కార్యకలాపాల వైపు మొగ్గు చూపుతారు. కాబట్టి దీర్ఘకాలిక వ్యూహంగా ఆయా వర్గాలను పట్టించుకోవడం ద్వారా అసంతృప్తులను నివారించాలి.

- వై.వెంకటేశ్వరరావు (వైవి) సిపిఎం కార్యదర్శివర్గ సభ్యుడు, ఎపి