ఫోకస్

విమర్శలు అర్థరహితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళనాడు రాజకీయ నాయకుల తప్పులకు గవర్నర్‌ను తప్పుపడుతున్నారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు తమిళనాడులో సమర్థవంతమైన నాయకత్వం లేక గవర్నర్‌ను విమర్శిస్తున్నారు. జయలలిత మృతి తరువాత ఏఐఎడిఎంకే శాసనసభ్యుల్లో ఏకాభిప్రాయం లేదు. శశికళ నేరం చేసినట్టు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. గవర్నర్ తీసుకున్న నిర్ణయంవల్ల తమిళనాడుకు మంచే జరిగింది. ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని శశికళ కోరగానే గవర్నర్ ఆహ్వానిస్తే, ఆమె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తీర్పు వెలువడిన తరువాత ముఖ్యమంత్రిగా శశికళ జైలుకు వెళ్లేవారు తమిళనాడు మళ్లీ సంక్షోభంలో పడేది. గవర్నర్ ఆచితూచి తీసుకున్న నిర్ణయంవల్ల మంచే జరిగింది. త్వరలోనే తీర్పు రాబోతుందని, శశికళ నేరం చేసిందని, శిక్ష తప్పదని ముందే గ్రహించడంవల్ల వెంటనే ఆహ్వానించలేదు. తమిళనాడు రాజకీయ పరిణామాలపై ఆ రాష్ట్ర నాయకులకే తప్ప గవర్నర్‌కో మరెవరికో ప్రమేయం లేదు. సిద్ధాంతాల కన్నా హీరోవర్షిప్ వంటి రాజకీయాలతో తమిళనాడు రాజకీయ పార్టీలకు సమర్థవంతమైన నాయకత్వం లేకుండాపోయింది. తొలుత పన్నీర్ సెల్వంకు మద్దతు ఇస్తామని డిఎంకె ప్రకటించింది. తరువాత వారి ఆలోచన మారింది. ఎఐడిఎంకె పార్టీ చీలి కొంతమంది తమతో చేతులు కలిపితే తామే అధికారం చెపట్టవచ్చు కదా? అనే ఆలోచన స్టాలిన్‌లో వచ్చింది. ఒక రోజు మద్దతు అని ప్రకటించిన వారు మరుసటి రోజే ఎఐఎడిఎంకె డిఎంకెకు బద్ధ శత్రువు కాబట్టి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారు చూసుకుంటున్నారు. అవకాశం వస్తే తామే అధికారంలోకి రావాలి అనేది డిఎంకె ఎత్తుగడ. గవర్నర్ ఎంతో ముందుచూపుతో నిర్ణయం తీసుకున్నారు. అడ్వకేట్ జనరల్ ఇండియా అభిప్రాయం తీసుకున్నారు. రాజ్యాంగ నిపుణులతో చర్చించారు. స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ ఆచితూచి నిర్ణయం తీసుకున్నారనడం సందేహం లేదు. శశికళ విషయంలో గవర్నర్ అనుమానమే నిజం అయింది.
- త్రిపురనేని హనుమాన్ చౌదరి
ప్రజ్ఞ్భారతి

- త్రిపురనేని హనుమాన్ చౌదరి