ఫోకస్

రెండు రాష్ట్రాలకు ఒకరే అయతే ఇబ్బందులే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభం నెలకొనడం సాధారణమే. అభివృద్ధి, విద్యుత్ కేటాయింపులు, జలాల పంపకం, పాలకులు, ప్రతిపక్షాల బలబలాలు వంటి అంశాలు సంక్షోభాన్ని సృష్టిస్తాయి. స్వయం ప్రతిపత్తితో నడిచే రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతలతో రాజకీయ సంక్షోభం వస్తే.. ఆ రాష్ట్ర గవర్నర్ పూర్తి బాధ్యత వహిస్తూ, సంక్షోభానికి తెరదించే అవకాశం ఉంటుంది. అయితే అది రాజకీయాలకతీతంగా జరగాలి. రెండు రాష్ట్రాల మధ్య జల పంపకాలు, నిధుల కేటాయింపులు, పలు ఒప్పందాలు వంటి వాటి మధ్య ఏర్పడే అంతర్యాలను బట్టి సంక్షోభం నెలకొంటుంది. అయితే వాటిని పరిష్కరించేందుకు ఆయా రాష్ట్రాల గవర్నర్లు వేర్వేరుగా ఉంటే ఫర్వాలేదు. కానీ రెండు రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉండటంతో సమస్యల పరిష్కారంలో కొంత జాప్యం, కొంత మేరకు కష్టనష్టాలు కూడా ఉద్భవించవచ్చు. అంతమాత్రాన గవర్నర్‌ను తప్పుపట్టడం మంచిది కాదు. వీలైనంత మేరకు గవర్నర్ల పాత్ర సముపాళ్లలోనే ఉంటుంది. పాలక వర్గాలు సంయమనంతో సమస్యలు పరిష్కరించుకుంటే గవర్నర్లవరకు పోనవసరం ఉండదు. సమస్యలు గవర్నర్ వరకు వెళ్లిందంటే.. సమస్యలు సాగదీసేవిగానే పరిగణించబడతాయి. అలా అని అన్ని సమస్యలు ఒక రకంగా ఉండవు. సాధ్యాసాధ్యాలను బట్టి సమస్యలు పరిష్కరింపబడతాయి. అంతేకాకుండా పలు సమస్యలతో రాష్ట్రాల్లో రాష్టప్రతి పాలన విధించే హక్కు కూడా గవర్నర్‌కు ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పాలక వర్గాలు రాజకీయ సంక్షోభానికి దూరంగా ఉంటేనే మంచిది. రాష్ట్ర రాజకీయ సంక్షోభాలపై ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించే గవర్నర్ల పాత్రను ఆదరించాలి. రాజకీయాల్లో చాలావరకు సర్దుకుపోయే స్వభావం ఉంటుంది. అలాంటి నేపథ్యంలో రాజకీయ సంక్షోభానికి తావివ్వకూడదు.
-పాండురంగారావు
లోక్‌సత్తా, తెలంగాణ అధ్యక్షుడు

-పాండురంగారావు